పెద్దల మాట చద్దన్నం మూట ‘ అనే నానుడి మనం వినే ఉంటాం. చద్దన్నంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వల్లే ఈ పోలిక పెట్టారు. ముఖ్యంగా వేసవిలో చద్దన్నం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయెజనలుంటాయని వెద్య నిపుణులు చెబుతున్నారు.

ఎండాకాలంలో ప్రతీరోజూ ఉదయాన్నే చద్దన్నం తింటే వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు.

చద్దన్నంలో పొటాషియం, క్యాల్షియం, ఐరన్, విటమిన్ లు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉల్లిపాయను నంచుకుని తింటే శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది.


చద్దన్నం తింటే తక్షణ శక్తి వస్తుంది. ఇది డీహైడ్రాషన్, అలసట, బలహీనతను దూరం చేసి శరీరంలో ఎలెక్ట్రోలైట్స్ ని సమతుల్యం చేస్తుంది.

మలబద్దకం, నీరసం తగ్గిపోతాయి. బీపీ అదుపులో ఉంటుంది.


పేగుల్లోని అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.


చద్దన్నం తింటే ఎముకుల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. అలాగే చాల రకాల ఇన్ఫెక్షన్లు, కొన్ని ప్రమాదకరమైన రోగాల ముప్పు తగ్గుతుందనేది నిపుణుల అభిప్రాయం.

ఇలాంటి మరిన్ని విషయాల కొరకు తెలుగు రీడర్స్ ను సంప్రదించండి.

Leave a Reply

Your email address will not be published