Home » పెంచిన పెన్షన్ అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం

పెంచిన పెన్షన్ అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం

by Shalini D
0 comment

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం వెలగపూడి సచివాలయంలో ప్రారంభమైంది. అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు సూపర్ సిక్స్ హామీలు, ఐదు సంతకాలపై మంత్రివర్గం ప్రధానంగా చర్చించనుంది. పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్‌కు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.

జులై 1 నుంచి 65 లక్షల మందికి రూ.7,000 పెన్షన్ అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. దీంతో వృద్ధులు, వితంతువులకు ప్రతినెలా వచ్చే పెన్షన్ రూ.3వేల నుంచి రూ.4వేలకు పెరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి పెన్షన్ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. జులై 1న ఒకేసారి 65 లక్షల మంది ఇంటి వద్దే రూ.7,000 పెన్షన్ అందుకోనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి యథావిధిగా నెలకు రూ.4వేలు పెన్షన్ వస్తుంది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment