Home » స్టార్ హీరో సిమిమా పై అనుష్క కామెంట్స్

స్టార్ హీరో సిమిమా పై అనుష్క కామెంట్స్

by Vishnu Veera
0 comments

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లు జాబితాలో అనుష్క (Anushka) ఒక్కటి. అక్కినేని నాగార్జున నటించిన సూపర్ (Super) సినిమాతో తెలుగు ఇండ్రస్ట్రీకి పరిచయం అయినా అనుష్క కొంతకాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించేసిందనే చెప్పాలి.సైజ్జీ జీరో సినిమాతో లావు పెరగిన అనుష్క (Anushka) తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది.

దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాకిచ్చింది. ఆ వెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మాములు స్థితిలోకి వచ్చింది. గతఏడాది యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. అనుష్క పరిశ్రమకు వచ్చి దాదాపు 19 ఏళ్ళు అవుతుంది. కథ నచ్చితే తప్పిస్తే అనుష్క సినిమా ఒప్పుకోదనే కాదు విషయం తెలిసిందే.

ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న అనుష్క.. తాను నటించిన చిత్రాల్లో ‘వేదం’ మరియు ‘అరుంధతి’ (Arundhati) చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని, నా క్యారెక్టర్స్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది అని చెప్పుకొచ్చింది. అలాగే చెత్త మూవీ ‘ఒక్క మగాడు’ అని..

ఆ సినిమా తనకు అస్సలు నచ్చదని అనుష్క సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించారు. 2008లో విడుదలైన ఒక్క మగాడు మూవీని వై.వి.ఎస్.చౌదరి డైరెక్ట్ చేయగా అనుష్క శెట్టి, సిమ్రాన్, విషా కొఠారి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ వార్తలును సందర్శించండి.

You may also like

Leave a Comment