Bangaru Chinni Manikantudayya lyrics Narsing Rao
పల్లవి:
ఆ ఐదు కొండల దేవుడయ్యా… బంగారు చిన్ని మణికంఠుడయ్యా

అందాల బాల మణికంఠుడయ్యా… సుందర సుకుమార రూపుడయ్యా

పసిడి మెట్ల పైన భావనా రూపుడు… బంగారు వన్నెల బాల మణికంఠుడు
ఆ ఐదు కొండల దేవుడయ్యా… పంబా తీరాన పసి బాలుడయ్యా
ఆ ఐదు కొండల్లో దేవుడయ్యా… పంబా తీరాన పసి బాలుడయ్యా
చరణం 1:
ఆ శబరి కొండలో శరణని వేడితే పరుగున వస్తాడయ్యా… ఆ పంబా బాలుడయ్యా
కష్టాలను తీర్చే కరుణాకరుడు… కానల ఉన్నాడయ్యా… రమణీయ రూపుడయ్యా
మంచి రోజు చూసుకున్న మాల నేను వేసుకున్నా…

శరణ ఘోష పలుకుంటు ఇరుముడినే కట్టుకున్న…
నేను పోతున్నా… నేనెళ్లిపోతున్నా…
ఊరు వాడ దాటి వెళ్ళెళ్లిపోతున్నా…
నేను పోతున్నా… నేనెళ్లిపోతున్నా…
ఇరుముడి కట్టుకొని ఎరిమేలి పోతున్నా…
ఆ ఐదు కొండల దేవుడయ్యా… బంగారు చిన్ని మణికంఠుడయ్యా
అందాల బాల మణికంఠుడయ్యా… సుందర సుకుమార రూపుడయ్యా
చరణం 2:
ఎరిమేలి లోన శ్రీ ధర్మశాస్త్రగా దర్శనమిస్తాడయ్యా… బహు దయగల దేవుడయ్యా
ఒంటికి రంగులు పూసుకొనాడితే రంధిని బాపునయ్యా… మన ఆరాధ్య దైవమయ్యా
ఎరిమేలి చేరుకున్న వావరుని చూసుకున్నా…
ఎరిమేలి చేరుకున్న వావరుని చూసుకున్నా…
పేట తళ్ళి ఆడుకొని అడవిదారి నడుస్తున్న…
నేను పోతున్నా…బయలెల్లిపోతున్నా…
అలుదాలు స్నానమాడి కరిమల దాటుతున్నా…
నేను పోతున్నా… బయలెల్లిపోతున్నా…
అలుదాలు స్నానమాడి కరిమల దాటుతున్నా…
ఆ ఐదు కొండల దేవుడయ్యా… పంబా తీరాన పసి బాలుడయ్యా
అందాల బాల మణికంఠుడయ్యా… సుందర సుకుమార రూపుడయ్యా
చరణం 3:
పడి మెట్ల మీద పసి బాల రూపమున వెలుగుతున్నాడయ్యా… చూసిన జన్మ ధన్యమయ్య
పచ్చని పంచగిరులలో వెలసిన శివహరి పుత్రుడయ్యా… చిన్నముద్రధారుడయ్యా
ఇరుముడి అప్పజెప్పి కంటినిండా చూసుకున్నా…

స్వామి నిన్ను నమ్ముకున్న ఇంటికి తిరిగెల్లుతున్నా…
నేను పోతున్నా… బయలెల్లిపోతున్నా…
మకర జ్యోతి చూసి మైమరిచిపోతున్నా…
నేను పోతున్నా… బయలెల్లిపోతున్నా…
మళ్ళా ఏడు వస్తానని మొక్కిపోతున్నా…
ఆ ఐదు కొండల దేవుడయ్యా… బంగారు చిన్ని మణికంఠుడయ్యా
ఆ ఐదు కొండల దేవుడయ్యా… బంగారు చిన్ని మణికంఠుడయ్యా
అందాల బాల మణికంఠుడయ్యా… సుందర సుకుమార రూపుడయ్యా
పసిడి మెట్ల పైన భావనా రూపుడు… బంగారు వన్నెల బాల మణికంఠుడు
ఆ ఐదు కొండల దేవుడయ్యా… పంబా తీరాన పసి బాలుడయ్యా
ఆ ఐదు కొండల్లో దేవుడయ్యా… పంబా తీరాన పసి బాలుడయ్యా
Read also: Yemi jethu Needu Pooja lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.