Home » అంబరాల వీధిలో (Ambaraala Veedhilo) (Telugu ) – ARM 

అంబరాల వీధిలో (Ambaraala Veedhilo) (Telugu ) – ARM 

by Lakshmi Guradasi
0 comments
Ambaraala Veedhilo song lyrics ARM

సెప్టెంబర్ 12, 2024న థియేటర్లలో విడుదలై మంచి ప్రజల ఆదరణను పొందిన చిత్రం ARM . ఇది ఓక మలయాళం యాక్షన్ అడ్వెంచర్ చిత్రం. టోవినో థామస్ త్రిపాత్రాభినయం, కథా కథనాలు, ఫోటోగ్రఫీ, నేపథ్య సంగీతం ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా OTT లో నవంబర్ 8, 2024 లో డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో విడుదల అయింది.

ఈ సినిమా కథ కథ 1900, 1950, 1990 సంవత్సరాలలో ఉత్తర కేరళలోని హరిపురం గ్రామంలో జరుగుతుంది. గ్రామంలోని విలువైన “చియోతి విలక్కు” అనే సంపదను రక్షించడానికి చేసే ప్రయత్నాలపై ఈ కథ అంత ఆధారపడింది.

పాట ఉద్దెశం:

మనం ఏదైనా పని చేయడానికి ఒక మోటివేషన్ అయితే కచ్చితంగా అవసరం అవుతుంది. ఒక్కోసారి ఆ మోటివేషన్ మనకి మన స్నేహితులు, తల్లిదండ్రుల ద్వారా ఇంకా అప్పుడప్పుడు ఏదైనా గొప్పగా సాధించిన వారిని చూసినప్పుడు లేదా పాటలు, కవితలు మనల్ని బాగా ప్రేరేపిస్తాయి మనల్ని ముందుకు నడుపుతుంది. అలాంటి ఒక పాటే ఈ ARM సినిమాలోని అంబరాల వీధిలో చిన్ని చందమామ.

ఈ పాటను సిందూరి విశాల్ గానం చేయగా, కృష్ణకాంత్ సాహిత్యం అందించారు, మరియు ధిబు నినన్ థామస్ సంగీతం సమకూర్చారు.

అంబరాల వీధిలో సాంగ్ లిరిక్స్ తెలుగు లో

అంబరాల వీధిలో చిన్ని చందమామ రా
అందున ఒదిగుంది రా
చెవుల పిల్లిరా

నీడ నీలి దీవిలో
నీటి మీద మెరిసెరా
ఆ వెన్నెల కాంతిలో కూర్మముందిరా

ఆ మాయ తాబేలుకి తాంబూలా
పేటిక కట్టుందిరా
తాపీగా ఈదుకుంటూ నీళ్లలో
ఏమూలో దాక్కుంది రా

తార లాంటి ఆకారం తాళమే
దానికి వేసుందిరా
లెక్కనే పెట్టలేని ఒక్కలే
అందులో ఉన్నయిరా

బుజ్జాయి రారా
కథ చెబుతా కన్నా
వినుకోరా నువ్వే బజ్జో
లాలీ జో లాలీ జో నాన్న

సరదాగా ఆడు మురిపెంగా ఆడు
ఎదుగుగింక ఎదుగు ఎదుగు హ్మ్మ్…
లాలీ జో లాలీ జో హ్మ్…
లాలీ జో లాలీ జో

నీ సుధూర ​​దారిలో ఆగకుండా సాగిపో
చెయ్యి పట్టి చూపగా తోడులేరని ఆ ఆ..

ఎదురు నీకు లేదులే
అడ్డు నీకు రాదులే
దారినిచ్చి జరుగులే నీటి అలలివే

నిశ్చింత గానే ఉండు
గాలులే నొప్పిని తీర్చ రావా
ఆకాశ నక్షత్రాలే
దిక్కుల్నే చూపెట్టవచ్చులేరా

నీ ముందు అగ్గి పుట్టె
చీకట్లే పారదోల కదిలే
నువ్వోక్క విత్తు వేస్తే
ఈ మన్ను అడవళ్లే మార్చేయదా

బుజ్జాయి రారా
కథ చెబుతా కన్నా
వినుకోరా నువ్వే బజ్జో
లాలీ జో లాలీ జో నాన్న

సరదాగా ఆడు మురిపెంగా ఆడు
ఎదుగుగింక ఎదుగు ఎదుగు

నిలవర… నిలవర..
పరుగున లే కదలరా
నిలవర… నిలవర..
జగమునే నువ్ గెలవరా

Ambarala Veedhilo Song Lyrics in English

Ambarala Veedhilo
Chinni Chanda Mama Raa
Andhuna Vodhigundhiraa
Chevula Pilli Raa…………

Needa Neeli Deevilo
Neeti Meeda Meriseraa
Aa Vennela Kaanthilo
Kurmamundhi Raa…

Aa Maya Thabeluki
Thambula Petika Kattundhiraa
Thapiga Eedukuntu
Nelallo Emulo Daagundhiraa

Tharalanti Aakaram Thalame
Daaniki Vesundhiraa
Lekkane Pettaleni Vokkale
Andhulo Unnayee Raa

Bujjayi Rara
Katha Chebutha Kanna
Vinukora Nuvve Bajjo…
Lali Jo Lali Jo

Nanna Saradaga Aadu
Muripengaa Aadu
Eduginka Edugu Edugu
Lali Jo Lali Jo

Nee Suduraa Daarilo
Aagakunda Saagipo
Chei Patti Choopaga
Thoduledhani…..

Eduru Neeku Ledule
Addu Neeku Raadhule
Daarinichi Jarupule
Neeti Alalive….

Nichinthagaane Undu
Gaalule Noppini Pilcharaava
Aakasha Nakshatraale
Dikkulne Choopetta Vachhuleraa

Nee Mundhu Aggi Putte
Cheekatle Paaradola Kadile
Nuvvokka Vithu Vesthey
Ee Mannu Adavalle marcheyadaa

Bujjayi Rara
Katha Chebutha Kanna
Vinukora Nuvve Bajjo…
Lali Jo Lali Jo

Nanna Saradaga Aadu
Muripengaa Aadu
Eduginka Edugu Edugu
Nilavaraaaa Nilavaraaa…..
Paruguna……le Kadalaraaa
Nilavaraaaa Nilavaraaa…..
Jagamune….Nuvu
Gelavaraa…..

Song Credits

పాట పేరుఅంబరాలా వీధిలో (Ambaraala Veedhilo)
చిత్రంఏ.ఆర్.యమ్ (A.R.M)
సంగీత స్వరకర్తధిబు నినన్ థామస్ (Dhibu Ninan Thomas)
సాహిత్యంకృష్ణకాంత్ (Krishna Kanth)
గానంసిందూరి విశాల్ (Sinduri Vishal)
తారాగణంటోవినో థామస్ (Tovino Thomas), కృతి శెట్టి (Krithi Shetty), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), సురభి లక్ష్మి (Surabhi Lakshmi), బాసిల్ జోసెఫ్ (Basil Joseph)
దర్శకుడుజితిన్ లాల్ (Jithin Laal)
రచించినవారుసుజిత్ నంబియార్ (Sujith Nambiar)
నిర్మించినవారులిస్టిన్ స్టీఫెన్ (Listin Stephen), డాక్టర్ జకరియా థామస్ (Dr. Zachariah Thomas)

Chilake Song Lyrics ARM

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.