Home » చెప్పమ్మ చెప్పమ్మ సాంగ్ లిరిక్స్ – మురారి

చెప్పమ్మ చెప్పమ్మ సాంగ్ లిరిక్స్ – మురారి

by Vinod G
1.9K views
cheppamma cheppamma song lyrics murari

చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మోమాటం
నువ్వంటే మరీ అదేదో ఇది అనేద్దామనే ఉన్నదీ
ఫలాన అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలనీ
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మోమాటం

వెంట తరుముతున్నావేంటి ఎంత తప్పుకున్నా
కంటికెదురు పడతావేంటి ఎటు చూసినా
చెంప గిల్లి పొతావేంటి గాలి వేలితోన
అంత గొడవపెడతావేంటి నిద్దరోతు ఉన్నా
అసలు నీకు ఆ చొరవే ఏంటి తెలియకడుగుతున్నా
ఒంటిగ ఉందనీవెంటి ఒక్క నిముషమైనా
ఇదేం అల్లరి భరించేదేల అంటూ నిన్నేల కసరనూ
నువ్వేంచేసినా బాగుంటుందనీ నిజం నీకెలా చెప్పనూ

చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మోమాటం

నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైన
ఏడిపించబుద్దౌతుంది ఎట్టాగైనా
ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా
కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా
నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపొతు ఉన్నా
లేనిపొనీ ఉక్రోషం తో ఉడుకెత్తనా
ఇదేం చూడక మహా పోజుగ ఎటో నువ్వు చూస్తూ ఉన్నా
అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడిచస్తున్నా అయ్యో రామా

చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మోమాటం
నువ్వంటె మరీ అదేదో ఇది అనేద్దామనే ఉన్నదీ
ఫలాన అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలనీ
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ ఐ లవ్ యూ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
ఐ లవ్ యూ | ఐ లవ్ యూ
ఐ లవ్ యూ | ఐ లవ్ యూ
ఐ లవ్ యూ | ఐ లవ్ యూ

చిత్రం: మురారి
గాయకులు: చిత్ర
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: మణిశర్మ
దర్శకత్వం: కృష్ణ వంశీ
తారాగణం: మహేష్ బాబు, సోనాలి బింద్రే తదితరులు

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.