84
కావాలసిన పదార్థాలు:-
- స్వీట్ కార్న్ గింజలు – 2 కప్పులు.
- ఉల్లి తరుగు – కప్పు.
- పచ్చి మిర్చి – 5.
- అల్లం తరుగు – టి స్పూను.
- క్యారేట్ తరుము – టేబుల్ స్పూను.
- కొత్తిమీర తరుగు – పావు కప్పు.
- బియ్యప్పిండి – అర కప్పు.
- ఉప్పు – తగినంత.
- నూనె – తగినంత.
తయారీ విదానం:-
ఒకమిక్సీ జార్ తీసుకుని దానిలో స్వీట్ కార్న్ గింజలు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, అల్లం తరుగు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, క్యారేట్ తరుము వేసి గట్టిగాగ్రాడ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో తగినంత ఉప్పు, బియ్యప్పిండి వేసి చపాతీ ముద్దలా మెత్తగా కలపాలి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి, కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. స్వీట్ కార్న్ మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత పిండిని తీసుకుని, పెనం మీద ఉంచి, చేతితో పల్చగా ఒత్తాలి. చుట్టూ నూనె వేసి మూత తీసి, రెండో వైపుకి తిప్పి, నూనె వేసి కొద్దిసేపు కాల్చాలి. తరువాత ప్లేటులోకి తీసుకోవాలి సాస్ తో ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగురీడర్స్ వంటలును సందర్శించండి.