కావలసినవి పదార్థాలు:
- అరటి పువ్వు – ఒక టీ
- ఎండుమిర్చి – ఆరు
- చింతపండు – 50 గ్రా
- బెల్లం తురుము – రెండు స్పూన్లు
- నూనె – నాలుగు టీస్పూన్లు
- ఆవాలు – 1 టిస్పూన్
- మినపప్పు – 1 టిస్పూన్
- పచ్చి శనగపప్పు – 1 టిస్పూన్
- కరివేపాకు – 2 రెమ్మలు
- ఉప్పు – తగినంత
తయారీ విధానం:
మందుగా అరటి పువ్వు తురుముకుని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి నూనె పోసి బాగా కాగనివాలి మందుగా తురుము కొన్ని పక్కన పెట్టిన అరటి పువ్వు వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని బాగా చల్లరనివాళి. మల్లి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి కొద్దిగా నూనె పోసి ఎండుమిర్చి,వేసి బాగా వేగించుకోన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని మందుగా చల్లర నించిన అరటి పువ్వు వేసుకుని దానిలో వేహించి ఎండుమిర్చి వేసి చింతపండు గ్రైండ్ చేసుకోవాలి. మల్లి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెపెట్టి దాన్ని నూనె పోసి ఆవాలు, ఎండుమిర్చి, మినపప్పు, పచ్చి శనగపప్పు, బెల్లం తురుము, కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోన్ని పక్కన పెట్టిన అరటి పువ్వు వేసి బాగా మగ్గనివ్వాలి.అంతే అరటి పువ్వు తో పచ్చడి రెడీ.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగురీడర్స్ వంటలును సందర్శించండి.