67
పెసరపప్పు అట్లు రెసిపికి కావలసిన పదార్థాలు:
- 1 కరివేపాకు రెమ్మ
- 1 చెంచా మిరియాలు
- 3 చెంచాల పెరుగు
- సగం టీస్పూన్ పంచదార
- 1 టమాటా, సన్నటి ముక్కలు
- 1 ఉల్లిపాయ, సన్నటి ముక్కలు
- 1 క్యాప్సికం, సన్నటి ముక్కలు
- సగం టీస్పూన్ కారం
- నూనె
- 1 చెంచా జీలకర్ర
- అంగుళం అల్లం ముక్క
- 4 పచ్చిమిర్చి
- 3 చెంచాల బియ్యం పిండి
- 3 చెంచాల సన్నం రవ్వ
- సగం టీస్పూన్ బేకింగ్ సోడా
- తగినంత ఉప్పు
పెసరపప్పు అట్లు తయారీ విధానం:
- పెసరపప్పును ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి. పెసరపప్పును కనీసం ఆరేడు గంటల పాటూ నానబెట్టుకోవాలి.
- ఉదయాన్నే నీటిని వంపేసి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. కాస్త బరకగా మిక్సీ పట్టిన తర్వాత అందులో ఒక్కోటి వేసుకోవాలి.
- సన్నగా తరిగిన కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, మిరియాలు,జీలకర్ర, పెరుగు వేసుకుని మరోసారి అన్నీ కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి.
- దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని అందులో బియ్యం పిండి, సన్నం రవ్వ, ఉప్పు, కొద్దిగా పంచదార వేసుకుని కలుపుకోవాలి.
- చివరగా బేకింగ్ సోడా కూడా వేసుకుని బాగా కలియబెట్టి అరగంట పాటూ పిండిని పక్కన పెట్టుకోవాలి.
- స్టవ్ మీద పెనం పెట్టుకుని నూనె రాసుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్దం చేసుకున్న పిండిని గరిటె నిండా తీసుకుని వేసుకోవాలి. కాస్త మందంగానే ఉండేలా చెంచాతో తిప్పాలి.
- చివరగా మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి. మీద కాస్త కారం పొడి చల్లుకోవాలి. అంచుల వెంబడి నూనె వేసుకోవాలి. అర నిమిషం పాటూ మూత పెట్టి మగ్గనివ్వాలి.
- కాస్త కాల్చుకున్న తర్వాత మరోవైపు కూడా వేసుకుని కాల్చుకుంటే సరిపోతుంది. పెసరపప్పు వెజిటేబుల్ అట్లు రెడీ అయినట్లే. దీన్ని చట్నీ, సాంబార్‌తో సర్వ్ చేసుకుంటే సరి.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగురీడర్స్ వంటలును సందర్శించండి.