94
కావలసిన పదార్థాలు:
- చిక్కటి పెరుగు – 1 కప్పు.
- పాలు – పావు కప్పు.
- ఇన్ స్టెంట్ కాఫీపొడి – అర టీస్పూన్.
- తేనె – 2 టేబుల్ స్పూన్లు.
- చాక్లెట్ పొడి – 2 టేబుల్ స్పూన్లు.
- ఐస్ ముక్కలు – 3 లేదా 4.
తయారీ విధానం:
ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకుని దానిలో పాలు పోసి వేడి చేసుకుని ఆ పాలు చల్లారాక పక్కన పెట్టుకోవాలి. ఇపుడు చిక్కటి పెరుగు, వేడి చేసి చల్లరీనా పాలు, ఇన్ స్టెంట్ కాఫీపొడి, తేనె, చాక్లెట్ పొడి. ఈ పదార్ధాలన్నింటినీ తీసుకొని మిక్సి జార్ లోకి వేసుకుని చిక్కటి లస్సి లా చేసుకోవాలి. ఆ తరువాత చాక్లెట్ లస్సి నీ ఒక గ్లాసుల్లో పోసి ఐస్ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు పిల్లలకు ఇస్తా ఇష్టం గా తాగుతారు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగురీడర్స్ వంటలును సందర్శించండి.