Na Sinni Anjanna Guttanu Moyanga lyrics

నా చిన్ని అంజన్న గుట్టను మోయంగా lyrics

by Lakshmi Guradasi

Na Sinni Anjanna Guttanu Moyanga lyrics

[పల్లవి]
నా చిన్ని అంజన్న గుట్టను మోయంగా
నా చిన్ని అంజన్న గుట్టను మోయంగా
నా చిన్ని అంజన్న గుట్టను మోయంగా
నా చిన్ని అంజన్న గుట్టను మోయంగా
బెల్లరాలి పడ్డదమ్మ సూడు… పెద్ద గట్టై నిలిచినాది నేడు

నా చిన్ని అంజన్న కొలువేదీరంగ
నా చిన్ని అంజన్న కొలువేదీరంగ
నా చిన్ని అంజన్న కొలువేదీరంగ
నా చిన్ని అంజన్న కొలువేదీరంగ
కొండగట్టు గుట్టాయే సూడు… అది కోతుల గట్టాయే నేడు

[చరణం 1]
నా చిన్ని అంజన్న గట్టుకు జేరంగ… కాలి నడకతోని ఆ మెట్లే ఎక్కంగా

భయాలన్నీ తొలుగునంట సూడు… దండి శక్తేదో మనలోన నిండు

నా చిన్ని అంజన్న దీక్షణు పూనంగా… మెడలోన మెండైన మాలను వేయంగా

శని బాధలు పోవునంట సూడు… కొత్త జీవితాలు వెలుగునంట సూడు
శని బాధలు పోవునంట సూడు… కొత్త జీవితాలు వెలుగునంట సూడు

నా చిన్ని అంజన్న గుట్టను మోయంగా
నా చిన్ని అంజన్న గుట్టను మోయంగా
నా చిన్ని అంజన్న గుట్టను మోయంగా
నా చిన్ని అంజన్న గుట్టను మోయంగా
బెల్లరాలి పడ్డదమ్మ సూడు… పెద్ద గట్టై నిలిచినాది నేడు
కొండగట్టు గుట్టాయే సూడు… అది కోతుల గట్టాయే నేడు

[చరణం 2]
నా చిన్ని అంజన్న పూజలు చేయంగా… సిందూర గంధము ఒంటి నిండా పూయంగా

కలలోన కనిపించు సూడు… తన అభయాన్ని అందించు రేడు

నా చిన్ని అంజన్న పాటలు పాడంగా… జై జై హనుమాన్ అంటూ భజనలు చేయంగా

భక్తుల్లో భక్తుడై సూడు… పాటలినుకుంటా మురిసిపోవు రేడు
భక్తుల్లో భక్తుడై సూడు… పాటలినుకుంటా మురిసిపోవు రేడు

నా చిన్ని అంజన్న గుట్టను మోయంగా
నా చిన్ని అంజన్న గుట్టను మోయంగా
నా చిన్ని అంజన్న గుట్టను మోయంగా
నా చిన్ని అంజన్న గుట్టను మోయంగా
బెల్లరాలి పడ్డదమ్మ సూడు… పెద్ద గట్టై నిలిచినాది నేడు
కొండగట్టు గుట్టాయే సూడు… అది కోతుల గట్టాయే నేడు

[చరణం 3]
నా చిన్ని అంజన్న గుట్టెక్కి సూడ… సీతమ్మ కన్నీళ్లు రామయ్య పాదాలు

ఆ గుర్తులు సూస్తుంటే నమ్మా… వాళ్లు కళ్లల్లా మెదిలేనమ్మా

నా చిన్ని అంజన్న గుడి వెనకా లోయమ్మ… బండల్లా నడుమ బేతాళుడున్నాడే

బేతాళుని కొలవంగా సూడు… మన బెంబేలు తొలుగునంట సూడు
బేతాళుని కొలవంగా సూడు… మన బెంబేలే తొలుగునంట సూడు

నా చిన్ని అంజన్న గుట్టను మోయంగా
నా చిన్ని అంజన్న గుట్టను మోయంగా
నా చిన్ని అంజన్న గుట్టను మోయంగా
నా చిన్ని అంజన్న గుట్టను మోయంగా
బెల్లరాలి పడ్డదమ్మ సూడు… పెద్ద గట్టై నిలిచినాది నేడు
బెల్లరాలి పడ్డదమ్మ సూడు… పెద్ద గట్టై నిలిచినాది నేడు

నా చిన్ని అంజన్న కొలువేదీరంగ
నా చిన్ని అంజన్న కొలువేదీరంగ
నా చిన్ని అంజన్న కొలువేదీరంగ
నా చిన్ని అంజన్న కొలువేదీరంగ
కొండగట్టు గుట్టాయే సూడు… అది కోతుల గట్టాయే నేడు
కొండగట్టు గుట్టాయే సూడు… అది కోతుల గట్టాయే నేడు
ఆ కొండగట్టు గుట్టాయే సూడు… అది కోతుల గట్టాయే నేడు
కొండగట్టు గుట్టాయే సూడు… అది కోతుల గట్టాయే నేడు
అది కోతుల గట్టాయే నేడు… అది కోతుల గట్టాయే నేడు

Read also: thandri-anjanna-swami-anjanna-lyrics

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like