siddi ma ganapathi song lyrics
పల్లవి:
సిద్ధి మా గణపతి శివుని పుత్ర గణపతి
దండిగా పూజలే గజముఖ మా గణపతి
గజముఖ మా గణపతి
వరప్రద గణపతి ఓంకార ప్రమోద
మూషిక వాహన మమ్మేలే గణపతి
మమ్మేలే గణపతి
అరెరే ముక్తిదాయ మంగళమూర్తి
అరెరే ముక్తిదాయ మంగళమూర్తి
విఘ్నాలు తొలగించు సర్వ సిద్ధాంతుడా
విఘ్నాలు తొలగించు సర్వ సిద్ధాంతుడా
సిద్ధి మా గణపతి శివుని పుత్ర గణపతి
దండిగా పూజలే గజముఖ మా గణపతి
చరణం 1:
పార్వతి పుత్రుడవంట మా భీమా భూపతి
దయతో చూడరాద మా బాలా గణపతి
ఇలలోనా పూజలే ఏ పండగ పబ్బమైన
నీకే చేసేమంట వక్రతుండాయ
ముల్లోకాధిపతికి ముద్దుల తనయుడవు
ఆదిదేవుడవు అందుకో మా పూజలు
బాలాచంద్రుడవు భక్తితో కొలిచాము
భోగభాగ్యాలను కలిగించు దాతా
అరెరే ముక్తిదాయ మంగళమూర్తి
అరెరే ముక్తిదాయ మంగళమూర్తి
విఘ్నాలు తొలగించు సర్వ సిద్ధాంతుడా
విఘ్నాలు తొలగించు సర్వ సిద్ధాంతుడా
సిద్ధి మా గణపతి శివుని పుత్ర గణపతి
దండిగా పూజలే గజముఖ మా గణపతి
చరణం 2:
నిష్ఠా నియమాలతో నీ దరికి వచ్చాము
సుఖశాంతులతో దీవించు బుద్ధిప్రియా
ప్రతిమేశ్వర పితాంబరా శశివర్ణము చతుర్భుజం
అంటూ నిను మొక్కి ఆపదలో తలిచాము
నాథా ప్రతిష్ఠుడా నమస్తుతే నమస్తుతే
శ్రీకారాయ నమః సౌమ్యాయ నమః
లంబకర్ణ నువ్వేలే గజకర్ణ నువ్వేలే
సిరి గల్లా గణపయ్య సిరులే కురిపించయ్య
అరెరే ముక్తిదాయ మంగళమూర్తి
అరెరే ముక్తిదాయ మంగళమూర్తి
విఘ్నాలు తొలగించు సర్వ సిద్ధాంతుడా
విఘ్నాలు తొలగించు సర్వ సిద్ధాంతుడా
సిద్ధి మా గణపతి శివుని పుత్ర గణపతి
దండిగా పూజలే గజముఖ మా గణపతి
చరణం 3:
గజభుజ మా గణపతి దండాలు గణపతి
పాపాలు పారదోలు కష్టాలను కడతేర్చు
చెంగల్వా చామంతి చెలరేగే గన్నేరు
తామర తంగేడుతో తరచుగా నీ పూజలు
ప్రతి ఇంట ప్రతిష్టించి నిత్య పూజలు చేసి
గంగమ్మ వడిలోకి నిన్నే చేర్చుతాము
బహుబుద్ధి గణపతికి బహుళ మంగళమే
లోకనాథుడికి నిత్య శుభ మంగళమే
అరెరే ముక్తిదాయ మంగళమూర్తి
అరెరే ముక్తిదాయ మంగళమూర్తి
విఘ్నాలు తొలగించు సర్వ సిద్ధాంతుడా
విఘ్నాలు తొలగించు సర్వ సిద్ధాంతుడా
సిద్ధి మా గణపతి శివుని పుత్ర గణపతి
దండిగా పూజలే గజముఖ మా గణపతి
Read also: tholi pooja nedele vigneshwara lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి .

