Bindhe Midha Bindhevetti song lyrics Nagavva

బిందె మీద బిందె పెట్టి (Bindhe Midha Bindhevetti) లిరిక్స్ | Nagavva

by Lakshmi Guradasi

Bindhe Midha Bindhevetti song lyrics Nagavva

పల్లవి:
బిందె మీద బిందె పెట్టి నీలాభవంతిలో పూల భవంతిలో…
ఎవరింటి బిడ్డేవమ్మ నీలాభవంతిలో పూల భవంతిలో…
బిందె మీద బిందె పెట్టి నీలాభవంతిలో పూల భవంతిలో…
షేరుదారు సెల్లేనమ్మ నీలాభవంతిలో పూల భవంతిలో…

చరణం 1:
సిమ్మని చీకటిలోనా ఎన్నెల రాతిరిలోనా
సిక్కుకుంటిని నేను వాని బిగి కౌగిలిలా…
ముద్దులియమని రాతిరి అచ్చెని కలలా
వాని శ్వాసలు తగిలి జ్వరం వచ్చేనె పైలా..
సోకులన్నీ దోచుకొనే చక్కని చిన్నోని కోసం…
గురిగి మీద గురిగి పెట్టి నీలాభవంతిలో పూల భవంతిలో…
గురిగి తాటు ముచ్చటేందో నీలాభవంతిలో పూల భవంతిలో…

చరణం 2:
ఆకుపచ్చ చీరెను కట్టి అద్దాల రైకను తొడిగి
జడలోన మల్లెలు పెట్టి ఎర్రలున్న అత్తరు కొట్టి…
కాటుక పెట్టిన జూడు నల్లని కళ్ళకు నేడు
ఎదురు చూస్తిని నేను ఎదలో తలచితి నిన్ను…
కంటికైనా కనరాడు కలలోన చెందురుడు…
చింగుల మీద చింగుల వాల్చి నీలాభవంతిలో పూల భవంతిలో…
చింగుల మీద చిలకలాలే నీలాభవంతిలో మల్ల పూల భవంతిలో…

చరణం 3:
రంగు రంగుల బంగ్లా రామ చక్కని బంగ్లా
పాల పురకలు తెచ్చి పచ్చని పందిరులేసి …
బాజాల చప్పుడు తోటి తోరాళ్లను కట్టి
మైల పూలును వేసి పెళ్లి పిల్లనూ చేసి…
కాయమైనోడి కోసం కన్ను మూయకుండా కాపలా కాసి…
బంగ్లా మీద బంగ్లా కట్టి నీలాభవంతిలో సిరి మేడల భవంతిలో…
బంగ్లా లోపట పాలరాళ్ళు నీలాభవంతిలో నీ వాడే భవంతిలో…

Read also: srilatha song lyrics idupu kayitham

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like