Tholi pooja nedele vigneshwara lyrics
పల్లవి
తొలి పూజ నీదేలే, విఘ్నేశ్వరా
ఓ బొజ్జ గణపయ్య దీవించరా..
ఓ… గణనాధ…. ఓ… గౌరిపుత్రా.
“తొలి పూజ నీదేలే విఘ్నేశ్వర “
చరణం1
ఇంతింత కాదయ్యా నీ మహిమలూ..
ఘనమైన పూజలు నీ కోసమూ”2″
పార్వతీ నందన అంభోదరా..
పావన రూప విఘ్నేశ్వరా”2″
“తొలి పూజ నీదేలే విఘ్నేశ్వరా”
చరణం2
కోటక్క దండాలు గణనాధుడా
నీకు పాద నమస్తే విఘ్నేశ్వరా”2″
చిన్ని చిన్నఅడుగులు నీ అడుగలు
చిన్నారి పలుకులు నీ మాటలు”2″
ఓ… గణనాధ … ఓ..గౌరిపుత్రా “2” “
“తొలిపూజ నీదేలే విఘ్నేశ్వరా”
చరణం 3:
నీకన్నా మాకింక ఎవరున్నారూ.
నీవే కదా మాకు తొలిదైవమూ”2″
కుడుములు ఉండ్రాళ్ళు నీకోసమే
మా హృదయ హారతి నీకిద్దుమూ “2
ఓ ..గణనాధ.. ఓ… గౌరిపుత్రా ..”2″
“తొలిపూజ నీదేలే విఘ్నేశ్వరా”
చరణం 4
మూషిక వాహన గజముఖుడా
మా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరా”2″
మా మొక్కలన్నీ తీర్చే వయా
ఓ వక్రతుండ మహాకాయా”2″
ఓ…గణనాధ… ఓ… గౌరిపుత్రా..”2″”
“తొలిపూజ నీదేలే విఘ్నేశ్వరా”
Read also : చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ లిరిక్స్
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి .

