పల్లవి
దేవ దేవ శంకరా ఓ దేవ శంకరా
మహిమగళ్ల శంకరా మా దేవ శంకరా
రావయ్యా శంకరా రాజునేలే శంకరా
సాంబశివా శంకరా సకలం సర్వేశ్వరా
మన్ను నీదే మిన్ను నీదే దేవ దేవ శంకరా
గాలి నీదే ధూళి నీదే ఓ దేవ శంకరా
ఆది నీదే అంతం నీదే దేవా దేవా శంకరా.
బాధ నీదే బరువు నీదే ఓ దేవ శంకరా..
నింద నీదే రంది నీది దేవ దేవా శంకరా
(దేవా దేవా )
చరణం 1
గూడు నీదే కాడు నీదే దేవదేవ శంకరా.
తోడు నీదే నీడ నీదే ఓ దేవ శంకరా
నారు నీదే నీరు నీదే దేవ దేవ శంకరా
ఊరు నీదే పేరు నీదే దేవ దేవ శంకరా.
ఆట నీదే పాట నీదే ఓ దేవ శంకరా
దేవ దేవ శంకరా ఓదేవ శంకరా
మహిమగల్ల శంకరా మాదేవ శంకరా
(కొరస్ )
చరణం 2
ముక్కుమీద కోపమాట దేవదేవ శంకరా
మొక్కితే వరమిస్తవాటా ఓ దేవా శంకరా
దిక్కు మొక్కు లేనోళ్ళను దేవదేవ శంకరా
దిక్కు నువ్వే అయితవాట ఓదేవ శంకరా
తిక్క తిక్క ఏశాలేస్తే దేవ దేవ శంకరా
లెక్కలు సరి జేస్తవాట ఓ దేవ శంకరా
(దేవా దేవా )
చరణం 3
ఆడ నువ్వే ఈడ నువ్వే దేవ దేవ శంకరా
యాడవోయిన జాడ నువ్వే ఓ దేవ శంకరా
అమ్మ నువ్వే అయ్య నువ్వే దేవదేవ శంకరా
ఆకలయితే బువ్వ నువ్వే ఓ దేవ శంకరా
కర్త నువ్వే కర్మ నువ్వే దేవ దేవ శంకరా
కాపు నువ్వే దాపు నువ్వే ఓదేవ శంకరా
(దేవా దేవా )
చరణం4
నిండూ ఆవాసనాడు దేవ దేవ శంకరా
నీ గుడిలో నిద్రజేసి మా దేవ శంకరా
గుండంలో తానమాడి దేవ దేవ శంకరా
గుడిసుట్టు తిరుగుదుమూ మా దేవ శంకరా
శిరిశైలా వాసా నీకు దేవ దేవ శంకరా
సిరిమల్లె పూల దండ ఓ దేవ శంకరా
పల్ల జడల రామలింగ దేవ దేవ శంకరా
సల్లంగా మమ్ము జూడవయ్య ఓ దేవ శంకరా
(దేవా దేవా )
Read also: Karandapadavila lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

