Karandapadavila song lyrics
కారండపడవిల కాకులున్నైరో కాకులున్నైరా
కాకి కడుపుల కైలాసమున్నదిరో ఈషుడున్నాడురా
కారండపడవిల కాకులున్నైరో కాకులున్నైరా
కాకి కడుపుల కైలాసమున్నదిరో ఈషుడున్నాడురా
జోలెనే ఉయ్యాల చేసి నిన్ను మోసే
జోలెనే ఉయ్యాల చేసి నిన్ను మోసే
మాయలోడి లీల మానవాలికి జోల
కారండపడవిల….
ఆహా కారండపడవిల కాకులున్నైరో కాకులున్నైరా
కాకి కడుపుల కైలాసమున్నదిరో ఈషుడున్నాడురా
పాముల పుట్టైన సీమల గుట్టైన
కాసేటి సెట్టైన కాలేటి కట్టైన
పాముల గుట్టైన సీమల పుట్టైన
కాసేటి సెట్టైన కాలేటి కట్టైన
స్వామిలేని జాడ లేనే లేదు ఈడ
స్వామిలేని జాడ లేనే లేదు ఈడ
కారండపడవిల….
ఆహా కారండపడవిల కాకులున్నైరో కాకులున్నైరా
కాకి కడుపుల కైలాసమున్నదిరో ఈషుడున్నాడురా
కురిసేటి ఆనింగి పారేటి ఈ గంగ
పండేటి ఆ పంట మండేటి ఈ మంట
కురిసేటి ఆనింగి పారేటి ఈ గంగ
పండేటి ఆ పంట మండేటి ఈ మంట
అంతటా నా స్వామి నిండి ఉన్నాడంట
తోడు నడిసేనంట మానవాలి వెంట
గంగ నది వడ్డున…
గంగ నది వడ్డున కొంగలున్నైరో కొంగలున్నైరా
కొంగ కడుపుల కోటి లింగాలలో జంగమయ్య ఉన్నాడురా
పట్టు వస్త్రాలను కోరలేదేనాడు
పాలాభిషేకాల నడగలేదేనాడు
పట్టు వస్త్రాలను కోరలేదేనాడు
పాలాభిషేకాల నడగలేదేనాడు
ఆది జంగమై ఆత్మ లింగమై
ఏ పేర పిలిచినా ఆ పేర పలుకంగా
కారండపడవిల….
కారండపడవిల కాకులున్నైరో కాకులున్నైరా
కాకి కడుపుల కైలాసమున్నదిరో ఈషుడున్నాడురా
Read Also: పిలిచిన పలకవు ఆంజనేయ నీవు song lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.