Tella Cheera Tella Raika Song Lyrics

తెల్ల చీర తెల్ల రైక Lyrics – Kongari Krishna & Mallamma Singer

by Lakshmi Guradasi

Tella Cheera Tella Raika Song Credits :

సాంగ్ : తెల్ల చీర తెల్ల రైకా (Tella Cheera Tella Raika)
గానం : కొంగరి కృష్ణ (Kongari Krishna) , మల్లమ్మ (Mallamma)
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు (Jonnavithula Ramalingeswara Rao)
సంగీతం: కళ్యాణ్ కీస్ (Kalyan Keys)

Tella Cheera Tella Raika Song Lyrics

తెల్ల చీర తెల్ల రైక తెలగున్న పిల్లో..

తెల్ల చీర తెల్ల రైక తెలగున్న పిల్లో
యాడికే పోతావు మొగడొచ్చేటల్లో యాడికే పోతావు
ఏడికన్నా నేను పోతా నీకేల పోరోడో
ఏమినొల్ల పులదండ ఎతుకపోయెవురో ఏమినొల్ల పులదండ

చిన్న చిన్న చెట్లల్ల చీకట్ల కాడొ
యాడికే పోతావు మొగడొచ్చేటల్లో యాడికే పోతావు
బోరిబొందరి గాడి ఆఫీసు కాడో
దుబాయ్ లో నీ పోటు దులిపి దింపేనురో దుబాయ్ లో నీ పోటు
అర్రె తెల్ల చీర తెల్ల రైక తెలగున్న పిల్లో
యాడికే పోతావు మొగడొచ్చేటల్లో యాడికే పోతావు

శ్రీరామ చింతల్ల సీటీలు గొట్టంగ
యాడికే ఓ పిల్ల మొగడొచ్చేటల్లో యాడికే ఓ పిల్ల
సీటీలు గొట్టనకు బావలున్నరురో
శ్రీరామ చింతల్ల సీటీలేందిరో శ్రీరామ చింతల్ల
అర్రె ముక్కుకు ముక్కెర ముద్దుగ పెట్టి
యాడికే ఓ కన్నె మొగడొచ్చేటల్లో యాడికే ఓ కన్నె
అయ్యయ్యో ముద్దు ముద్దులన ముక్కెర చూసి
మాటలు గలపానికి మనసెట్ల వచ్చే మాటలు గలపా

పిల్లా నల్గొండ నేను పోయి నకిలసు తెచుండే
యాడికే పోతావు నేనొచ్చేయాల్లో యాడికే పోతావు
అబ్బబ్బా నకిలసు నీదండ నాకొద్దు పోరో
నల్లపూసల దండ ఎతుకపోయెవురో నల్లపూసల దండ

అర్రె చిన్న చిన్న కాళ్ళల్ల సిరిగజ్జలేసి
యాడికే ఓ పిల్ల మొగడొచ్చేటల్లో యాడికే పోతావు
అయ్యయ్యో గజ్జెల సప్పుడుకు ఎంటరాగయ్యో
నా బావ నాకిట్ట్ల పంపినాడయ్యో నా బావ నాకిట్ట్ల
అర్రె తెల్ల చీర తెల్ల రైక తెలగున్న పిల్లో
యాడికే పోతావు మొగడొచ్చేటల్లో యాడికే పోతావు

పిల్లా ఎర్రచీర ఎర్రరైక మరదలు పిల్లో
యాడికే పోతావు నేనొచ్చేటల్లో యాడికే పోతావు
అబ్బబ్బా ఎర్రచీర ఎర్రరైక ఎండల్ల మెరిసే
ఓ పిల్ల నీ కండ్లు సెక్గున్న మెరిసే ఓ పిల్ల నీ కండ్లు

అహా అట్లా అట్లా పొయెటి అందాల పిల్లో
నేనెవరే ఓ పిల్ల నీకు తెలుసునానే నెవరే ఓ పిల్ల
అయ్యో అయ్యో మారువేషంలున్న మాయాల మనిషి
పెనిమీటి నువ్వని నాకు తెలుసునయ్యో నా పెనిమీటి నువ్వని

Read also: బంగారం Bangaram Lyrics, Lenin

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like