వచ్చె వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చె గిచ్చే పిల్ల గాలుల్లారా
వచ్చె వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చె గిచ్చే పిల్ల గాలుల్లారా
కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నొ మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నొ మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలి వానా లాలి పాడేస్తారా
పిల్ల పాపల వాన బుల్లి పడవల వాన
చదువు బాధనె తీర్చి సెలవులిచ్చిన వాన
గాలి వాన కబడ్డి వేడి వేడి పకోడి
ఈడు జోడు డి డిడిడి తోడుండాలి ఓ లేడి
ఇంద్రధనస్సులొ తళుకుమనె ఎన్ని రంగులో
ఇంతి సొగసులె తడిసినవి నీటి కొంగులో
శ్రావణ మాసాల జలతరంగం
జీవన రాగాలకిది ఓ మృదంగం
కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నొ మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నొ మాకున్నాయ్
వచ్చె వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చె గిచ్చే పిల్ల గాలుల్లారా
కోరి వచ్చినా ఈ వాన గోరు వెచ్చనై నాలోన
ముగ్గుల సిగ్గు ముసిరెస్తె ముద్దులాటిదె మురిపానా
మెరిసె మెరిసె అందాలు తడిసె తడిసె పరువాలు
గాలి వానలా పందిళ్ళు కౌగిలింతల పెళ్ళిళ్ళు
నెమలి ఈకలొ ఉలికిపడె ఎవరి కన్నులో
చినుకు చాటునా చిటికెలతొ ఎదురు చూపులో
నల్లని మేఘాల మెరుపులందం
తీరని దాహాలా వలపు పందెం
కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నొ మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నొ మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలి వానా లాలి పాడేస్తారా
వచ్చె వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చె గిచ్చే పిల్ల గాలుల్లారా
కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నొ మాకున్నై
గుండెలోన దాచుకున్న గాధలెన్నొ మాకున్నై
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలి వానా లాలి పాడేస్తారా
_________________
Song Credits:
పాట పేరు : వచ్చే వచ్చె (Vache Vache)
చిత్రం: ఆనంద్ (Anand)
సంగీత దర్శకుడు: K.M.రాధాకృష్ణన్ (K.M.Radhakrishnan)
సాహిత్యం: వేటూరి (Veturi)
గాయని: శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal)
దర్శకుడు: శేఖర్ కమ్ముల (Shekar Kammula)
తారాగణం: రాజా (Raja), కమలిని ముఖర్జీ (Kamalini Mukherjee)
See Also plz click on this: nuvvenaa-naa-nuvvenaa-song-lyrics-anand
yamuna-theeram-song-lyrics-anand
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

