కట్ల కట్ల మిరపకాయ కాళ్ళ గుత్తులు మెరియానాయే
బోట్ల బోట్ల చీరది పోకట్ల చిన్నది
చల్ బోట్ల బోట్ల చీరది పోకట్ల చిన్నది
చల్ బోట్ల బోట్ల చీరది పోకట్ల చిన్నది
ఆబంతి సేబంతి చెలియా నీకు ఇత్తగాని
కొండమీది కోతినైనా చిటికలోన తేత్తగాని
చిన్నగొడ మీదికెళ్లి చేతులియ్యవే
చల్ చిన్నగొడ మీదికెళ్లి చేతులియ్యవే..
గురియవన్నే చీర గట్టి గుద్దినట్టు గోసి పెట్టి
గున్న గున్నవాయే గునకపూల చిన్నది
చల్ గున్న గున్నవాయే గునకపూల చిన్నది
చల్ గున్న గున్నవాయే గునకపూల చిన్నది
ఆబంతి సేబంతి చెలియా నీకు ఇత్తగాని
మా ఇంటికి మీ ఇంటికి నడుమ నిచ్చెనేత్తగాని
గట్టెల తడిమీనికెళ్లి కన్ను గిలుపవే
ఆ గట్టెల తడిమీనికెళ్లి కన్ను గిలుపవే
అల్లిపూల చీరకట్టి అద్దాల రైకదోడిగి
ఆగమాగమచ్చే అందమొల్ల చిన్నది
చల్ ఆగమాగమచ్చే అందమొల్ల చిన్నది
చల్ ఆగమాగమచ్చే అందమొల్ల చిన్నది
అరె ఆబంతి సేబంతి చెలియా నీకు ఇత్తగాని
బతుకంతా కాళ్ళ గాడ నేను బడి సత్తగాని
అరుగు బండమినికెళ్లి అలికిరియవే
గా అరుగు బండమినికెళ్లి అలికిరియవే
ఎర్ర చీర కట్టుకొని ఎండి గొలుసులు పెట్టుకొని
ఎన్నెలోలె ఎల్లే చిరికాల చిన్నది
చల్ ఎన్నెలోలె ఎల్లే చిరికాల చిన్నది
చల్ ఎన్నెలోలె ఎల్లే చిరికాల చిన్నది
ఆబంతి సేబంతి చెలియా నీకు ఇత్తగాని
నీ అడుగుల నడిసచ్చి ఏడడుగులెత్తగాని
పందిరి గుంజ సాటుకెళ్ళి పలుకరియవే
చల్ పందిరి గుంజ సాటుకెళ్ళి పలుకరియవే
మావిడంచు చీరకట్టి మల్లెపూలు సిగలపెట్టి
మౌనంగావోయె మట్టి కాళ్ళ చిన్నది
చల్ మౌనంగావోయె మట్టి కాళ్ళ చిన్నది
చల్ మౌనంగావోయె మట్టి కాళ్ళ చిన్నది
ఆబంతి సేబంతి చెలియా నీకు దెత్తగాని
నువ్వు కోరుకుంటే నా పాణమైన ఇత్తగాని
గడిగొయ్యలమినికెళ్లి సైగ జెయ్యవే
గా గడిగొయ్యలమినికెళ్లి సైగ జెయ్యవే
గా గడిగొయ్యలమినికెళ్లి సైగ జెయ్యవే
__________________
Song Credits:
సాంగ్ : గున్న గున్నవాయే చిన్నది (Gunna Gunnavoye Sinnadhi)
సాహిత్యం, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ మల్లిక్‌తేజ (Sv Mallikteja)
నిర్మాత: రాజ్‌కుమార్ ఒర్సు (Rajkumar Orsu)
గాయకులు: లచ్చుమక్క బడుగు (Lachumakka Badugu), Sv మల్లిక్తేజ (Sv Mallikteja)
నటీనటులు: వైష్ణవి సోనీ (Vaishnavi Sony), ఈశ్వర్ సాయి (Eshwar Sai)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.