తెల్లవారితే కనురెప్పల తొలి మెలుకువ నువ్వే
నా గుప్పెడు గుండెల్లో చిరుచప్పుడు నువ్వే
పొలమారితే నీ మనుసుకి అది నా పొరపాటే
నీ పేరే పలకడమే పెదవులకలవాటే..
వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే
వేకువలా చూస్తుందే నువ్వు నడిచిన బాటే
ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే
నా మనసే నీదయ్యే వినదే నా మాటే
ఎవరే..ఎవరే..ప్రేమను మాయంది…..
ఎవరే ఈ హాయికి హృదయం చాలంది ..
ఎవరే నీన్నే నా వైపు నడిపే ..
నా ఊహల మదురోహాల హరివిల్లు నింపే..
తీయతీయని నిమిషాలే నీలోన ఒంపే
నా ఒంటరి కాలాన్నే నీతొన చెరిపే
ఆ దైవమే నాకు చెప్పింది ఎపుడో
నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటు
నా ప్రాణమే నీకు చెపుతోంది ఇపుడు
నువ్ లెక నే లేనని
గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే
దాచేయాలనుకుంటే అది నా అత్యాశే
అడుగంత దూరం నువు దూరమైనా
నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే…ఎవరే..
వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే
వేకువలా చూస్తుందే నువ్వు నడిచిన బాటే
ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే
నా మనసే నీదయ్యే వినదే నా మాటే
ఎవరే..ఎవరే..ప్రేమను మాయంది…..
ఎవరే ఈ హాయికి హృదయం చాలంది ..
In English Version:
Tellavaarithe kanureppala tholi melukuva nuvve
Naa guppeḍu guṇḍello chiruchappuḍu nuvve
Polamaarithe nee manasukii adi naa porapaate
Nee pere palakadame pedhavulakalavaate..
Vennelalaa untundhe nee pakkana chote
Vekuva laa choosthundhe nuvvu nadichina baate
Praanaale theesthundhe nee oohalathote
Naa manase needhayye vinadhe naa maate
Evare.. evare.. premanu maayandi…..
Evare ee haayiki hrudayam chaalandi..
Evare nenne naa vaipu nadipe..
Naa oohala madhurohaala harivillu nimpe..
Theeya theeyani nimishaale neelona ompe
Naa ontari kaalanne neethona cheripe
Aa daivame naaku cheppindhi epudo
Nee chinni chirunavve viluvaina varamantu
Naa praaname neeku chepthondhi ipudu
Nuvvu leka ne lenani
Gadhilanti madhilo nadhilanti ninne
Daacheyaalanukunte adi naa athyaashe
Adugantha dooram nuvvu dooramaina
Naa oopiri chirunaama telipedhe evare… evare..
Vennelalaa untundhe nee pakkana chote
Vekuva laa choosthundhe nuvvu nadichina baate
Praanaale theesthundhe nee oohalathote
Naa manase needhayye vinadhe naa maate
Evare.. evare.. premanu maayandi…..
Evare ee haayiki hrudayam chaalandi..
____________________
Song Credits:
సాంగ్ : ఎవరే (Evare)
చిత్రం: ప్రేమమ్ (Premam)
సాహిత్యం: శ్రీ మణి (Sree Mani)
సంగీతం: రాజేష్ మురుగేశన్ (Rajesh Murugesan)
గాయకుడు: విజయ్ యేసుదాస్ (Vijay Yesudas)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.