మూడు వేలిస్తాం, మొద్దు పిల్లనిస్తాం
రా, వయ్యా పెళ్లి కొడుకా, విడిదిలోనికి
మూడు వేలక్కర్లేదు, మొద్దు పిల్ల అక్కర్లేదు
రామండి మావయ్య గారు, విడిదిలోనికి
మొద్దు పిల్లతో పాటు ముద్దుటుంగరం ఇస్తాం
రా, వయ్యా పెళ్లి కొడుకా, విడిదిలోనికి
మొద్దు పిల్ల అక్కర్లేదు, ముద్దుటుంగరం అక్కర్లేదు
రామండి మావయ్య గారు, విడిదిలోనికి
మూడు వేలిస్తాం, మొద్దు పిల్లనిస్తాం
రా, వయ్యా పెళ్లి కొడుకా, విడిదిలోనికి
నాలుగు వేలిస్తాం, నల్ల పిల్లనిస్తాం
రా వయ్యా పెళ్లి కొడుకా, విడిదిలోనికి
నాలుగు వేలక్కర్లేదు, నల్ల పిల్ల అక్కర్లేదు
రామండి మావయ్య గారు, విడిదిలోనికి
నల్ల పిల్లతో పాటు నిమ్మ తోటలు ఇస్తాం
రా, వయ్యా పెళ్లి కొడుకా, విడిదిలోనికి
నల్ల పిల్ల అక్కర్లేదు, నిమ్మ తోటలఅక్కర్లేదు
రామండి మావయ్య గారు, విడిదిలోనికి
ఐదు వేలిస్తాం, అల్లరి పిల్లనిస్తాం
రా, వయ్యా పెళ్లి కొడుకా, విడిదిలోనికి
ఐదు వేలక్కర్లేదు, అల్లరి పిల్ల అక్కర్లేదు
రామండి మావయ్య గారు, విడిదిలోనికి
అల్లరి పిల్లతో పాటు అద్దాల మేడ లిస్తాం
రా, వయ్యా పెళ్లి కొడుకా, విడిదిలోనికి
అల్లరి పిల్ల అక్కర్లేదు, అద్దాల మేడ అక్కర్లేదు
రామండి మావయ్య గారు, విడిదిలోనికి
ఆరు వేలిస్తాం, అలిగే పిల్లనిస్తాం
రా, వయ్యా పెళ్లి కొడుకా, విడిదిలోనికి
ఆరు వేలక్కర్లేదు, అలిగే పిల్ల అక్కర్లేదు
రామండి మావయ్య గారు, విడిదిలోనికి
అలిగే పిల్లతో పాటు అరటీ తోటలు ఇస్తాం
రా, వయ్యా పెళ్లి కొడుకా, విడిదిలోనికి
అలిగే పిల్ల అక్కర్లేదు, అరటి తోటలక్కర్లేదు
రామండి మావయ్య గారు, విడిదిలోనికి
ఏడు వేలిస్తాం, ఎడ్డి పిల్లనిస్తాం
రా, వయ్యా పెళ్లి కొడుకా, విడిదిలోనికి
ఏడు వేలక్కర్లేదు, ఎడ్డి పిల్ల అక్కర్లేదు
రామండి మావయ్య గారు, విడిదిలోనికి
ఎడ్డి పిల్లతో పాటు ఎద్దూల బండి ఇస్తాం
రా, వయ్యా పెళ్లి కొడుకా, విడిదిలోనికి
ఎడ్డి పిల్ల అక్కర్లేదు, ఎడ్ల బండి అక్కర్లేదు
రామండి మావయ్య గారు, విడిదిలోనికి
ఎనిమిది వేలిస్తాం, ఎర్ర పిల్లనిస్తాం
రా, వయ్యా పెళ్లి కొడుకా, విడిదిలోనికి
ఎనిమిది వేలక్కర్లేదు, ఎర్ర పిల్ల అక్కర్లేదు
రామండి మావయ్య గారు, విడిదిలోనికి
ఎర్ర పిల్లతో పాటు ఇత్తడి గిన్నెలు ఇస్తాం
రా, వయ్యా పెళ్లి కొడుకా, విడిదిలోనికి
ఎర్ర పిల్ల అక్కర్లేదు, ఇత్తడి గిన్నెలు అక్కర్లేదు
రామండి మామయ్య గారు, విడిదిలోనికి.
తొమ్మిది వేలిస్తాం, తెల్ల పిల్లనిస్తాం
రా, వయ్యా పెళ్లి కొడుకా, విడిదిలోనికి
తొమ్మిది వేలక్కర్లేదు, తెల్ల పిల్ల అక్కర్లేదు
రామండి మావయ్య గారు, విడిదిలోనికి
తెల్ల పిల్లతో పాటు తొక్కూడు బండి ఇస్తాం
రా, వయ్యా పెళ్లి కొడుకా, విడిదిలోనికి
తెల్ల పిల్ల అక్కర్లేదు, తొక్కుడు బండి అక్కర్లేదు
రామండి మామ గారు, విడిదిలోనికి
పది వేలిస్తాం, పొట్టి పిల్లనిస్తాం
రా, వయ్యా పెళ్లి కొడుకా, విడిదిలోనికి
పది వేలక్కర్లేదు, పొట్టి పిల్ల అక్కర్లేదు
రామండి మావయ్య గారు, విడిదిలోనికి
పొట్టి పిల్లతో పాటు పట్టే మంచాలు ఇస్తాం
రా, వయ్యా పెళ్లి కొడుకా, విడిదిలోనికి
పొట్టి పిల్ల అక్కర్లేదు, పట్టే మంచాలక్కర్లేదు
రామండి మావయ్య గారు, విడిదిలోనికి
ఇక లక్ష కోట్లిస్తాం, మా పిల్లనిస్తాం
రావయ్యా పెళ్లి కొడుకా, విడిదిలోనికి
ఓ లక్ష కోట్లక్కర్లేదు, మీ పిల్లనిస్తే చాలు
వస్తామండి మావయ్య గారు, విడిదిలోనికి
మేం వస్తామండి మావయ్య గారు, విడిదిలోనికి
మేం వస్తామండి మావయ్య గారు, విడిదిలోనికి
_______________________
Song Credits:
సాంగ్ : విడిదిలోనికి (Vididhiloniki)
సాహిత్యం : సాయి ప్రసాద్ పూజారి (Sai Prasad poojari)
సంగీతం: మదీన్ SK (Madeen SK)
గానం: ప్రభ (Prabha), శ్రీనిధి (Srinidhi), మమత రమేష్ (Mamatha Ramesh), లావణ్య (Lavanya)
నిర్మాత: వెంకట్ శౌర్య (Venkkat Sauryaa)
తారాగణం: సునీత మరాసియార్ (Sunitha Marasiar), వెంకట్ శౌర్య (Venkkat Sauryaa)
See Also plz click on this: mamidi-konala-meena-folk-song-lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
