నీల గగన ఘనవిచలన..
ధరణిజ శ్రీ రమణ
ఆ.. ఆ…ఆ ..
మధుర వదన నళిన నయన
మనవి వినరా రామా..
పల్లవి:
రామ చక్కని సీతకి
అరచేత గోరింట..
ఇంత చక్కని చుక్కకీ..
ఇంకెవరో మొగుడంట..
రామ చక్కని సీతకీ..
చరణం1:
ఉడత వీపున వేలు విడిచిన
పుడమి అల్లుడు రాముడే..
ఎడమ చేతను శివుని విల్లును
ఎత్తిన రాముడే..
ఎత్తగలడా సీత జడనూ
తాళి కట్టే వేళలో..??
రామ చక్కని సీతకీ..
చరణం2:
ఎర్రజాబిలి చేయిగిల్లి
రాముడేడని అడుగుతుంటే..
చూడలేదని పెదవి చెప్పే..
చెప్పలేమని కనులు చెప్పే..
నల్లపూసైనాడు దేవుడు
నల్లనీ రఘురాముడూ..
రామ చక్కని సీతకీ..
చరణం3:
చుక్కనడిగా దిక్కునడిగా..
చెమ్మగిల్లిన చూపునడిగా..
నీరు పొంగిన కనులలోన
నీటి తెరలే అడ్డునిలిచే…
చూసుకోమని మనసు తెలిపే..
మనసు మాటలు కాదుగా..
రామ చక్కని సీతకి
అరచేత గోరింట..
ఇంత చక్కని చుక్కకీ..
ఇంకెవరో మొగుడంట..
రామ చక్కని సీతకీ..
ఇందువదన కుందరదన మందగమన భామా..
ఎందువలనా ఇందువదనా.. ఇంత మదనా?? ప్రేమా?
In English Version:
Neela gagana ghanavichalana..
Dharanija Sri Ramana
Aa.. aa… aa..
Madhura vadana nalina nayana
Manavi vinaraa Raamaa..
Pallavi:
Raama chakkani Seethaki
Arachetha gorinta..
Intha chakkani chukkakee..
Inkevaro mogudanta..
Raama chakkani Seethakee..
Charanam 1:
Udata veepuna velu vidichina
Pudami alludu Raamude..
Edama chethanu Shivuni villunu
Etthina Raamude..
Etthagaladaa Seetha jadanu
Thaali katte velalo..??
Raama chakkani Seethakee..
Charanam 2:
Erra jaabili cheyi gilli
Raamudedani aduguthunte..
Choodaledani pedavi cheppe..
Cheppalemani kanulu cheppe..
Nalla poosainaadu Devudu
Nallani Raghuraamudoo..
Raama chakkani Seethakee..
Charanam 3:
Chukkanadigaa dikkanadigaa..
Chemmagillina choopunadigaa..
Neeru pongina kanulalona
Neeti theraley adduniliche…
Choosukomani manasu thelipe..
Manasu maatalu kaadugaa..
Raama chakkani Seethaki
Arachetha gorinta..
Intha chakkani chukkakee..
Inkevaro mogudanta..
Raama chakkani Seethakee..
Induvadana kundaradana mandagamana bhaamaa..
Enduvalanaa induvadanaa.. intha madanaa?? prema?
____________________-
Song Credits:
పాట: రామ చక్కని (Rama Chakkani)
చిత్రం: గోదావరి (Godavari)
తారాగణం: కమలినీ ముఖర్జీ (Kamalinee Mukherjee), సుమంత్ (Sumanth)
సంగీత దర్శకుడు: K. M. రాధా కృష్ణన్ (K. M. Radha Krishnan)
గీతరచయిత: వేటూరి సుందరరామ మూర్తి (Veturi Sundararama Murthy)
గాయకులు: గాయత్రి అశోక్ (Gayatri Ashokan)
See Also plz click on this: andamga-lenaa
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
