Tirumalavasa Sri Venkatesha song lyrics

తిరుమలవాస శ్రీ వేంకటేశ (Tirumalavasa Sri Venkatesha) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

తిరుమలవాస శ్రీ వేంకటేశ
హరి హరి గోవిందా…
తిరుమలవాస శ్రీ వేంకటేశ
హరి హరి గోవిందా…
సప్తగిరులపై వెలసిన స్వామి
కలియుగ దైవమువే బాలాజీ కలియుగ దైవమువే…

ఆపద్ధమొక్కులవాడ రమణ ఆదుకునే స్వామి…
ఆపద్ధమొక్కులవాడ రమణ
ఆదుకునే స్వామి…
నే పదద్వయములు
కొలిచిన వారికి తొలగును పాపములే గోవింద తొలగును పాపములే…

మెట్టు మెట్టుకు గోవిందంటూ నీ సన్నిధి చేరీ…
మెట్టు మెట్టుకు గోవిందంటూ నీ సన్నిధి చేరీ…
నీ దర్శనమే చేసిన వారికి
కలుగును సౌక్యాలే ఓ శ్రీహరి కలుగును సౌక్యాలే…

పన్నగశయన ఓ కమలనయన
అలిగిన సిరికోసం…
పన్నగశయన ఓ కమలనయన
అలిగిన సిరికోసం…
అవతరించితివి ఈ భువిలోన
శ్రీ వేంకటేశుడవై ఓ స్వామి
శ్రీ వేంకటేశుడవై…

ద్వాపరమందున తల్లి యశోదకు నీవిచ్చినమాట…
ద్వాపరమందున తల్లి యశోదకు నీవిచ్చినమాట…
తీర్చుటకోసం వకుల నీడలో
తిరుమల నిలిచితివి శ్రీ రమణ తిరుమల నిలిచితివి…

సీతకు బదులుగా లంకకు వెళ్లిన వేదవతికి నీవు…
సీతకు బదులుగా లంకకు వెళ్లిన వేదవతికి నీవు…
ఇచ్చినమాటను నిలుపుటకోసం
కలియుగమున స్వామి వెంకటరామానుడవైనవు…

వేదవతి నీ పద్మావతిగా కలియుగమున స్వామి…
వేదవతియే నీ పద్మావతిగా కలియుగమున స్వామి…
ఆకాశరాజు అల్లుడా రారా
ఆనందానందనమే నీ తిరుమల ఆనందానందనమే …

మొక్కులు ముడుపులు చెల్లించి
నిన్నే పూజించే…
మొక్కులు ముడుపులు చెల్లించియి
నిన్నే పూజించే…
భక్తుల కోర్కెలు తీర్చేడి రమణ కలియుగ వైకుంఠం
నీ క్షేత్రం కలియుగ వైకుంఠం…

అన్నమయ్య త్యాగయ్యలు నిన్ను
బహువిధములుగను…
అన్నమయ్య త్యాగయ్యలు నిన్ను
బహువిధములుగను…
కీర్తించిరి వైకుంఠవాస నేనెటు కీర్తింతు
బాలాజీ నేనెటు కీర్తింతూ…

తలనీలాలు సమర్పించిన తొలగును పాపలు…
తలనీలాలు సమర్పించిన తొలగును పాపలు…
పునీతమగు మా మానవ జన్మ పుష్కర స్నానంతో
వెంకన్న పుష్కర స్నానంతో…

అలిగిన సతి శ్రీలక్ష్మి కోసము అవనికియే తెంచి…
అలిగిన సతి శ్రీలక్ష్మి కోసము అవనికియే తెంచి…
నరుడిగా నానకష్టాలన్నీ పడితివి
శ్రీహరి నీవేగా పరమాత్మ శరణం…

పాలకడలిలో శేషతల్పమున పవళించే స్వామి…
పాలకడలిలో శేషతల్పమున పవళించే స్వామి…
కలియుగవాసుల కమేతము తీర్చగ పరుగునా వచ్చితివా
మా కోసం తిరుమల వెలసితివా ఆ…

అంతచూసిన తనవితీరదు
స్వామి నీ రూపం…
అంతచూసిన తనవితీరదు
స్వామి నీ రూపం…
చూసిన వెంటనే మళ్ళి మళ్ళి చూడాలనిపించు…
నీ మూర్తినే చూడాలనిపించు…

ఏడు లోకముల చిహ్నముగా
నే ఏడు కొండలెక్కి…
ఏడు లోకముల చిహ్నముగా
నే ఏడు కొండలెక్కి…
ఏడు జన్మల పాపాలన్నీ తొలగించేదవయ్యా
గోవింద తొలగించేదవయ్యా…

సిరులిచ్చే శ్రీలక్ష్మి ఉన్నాను
కుబెరుని అప్పడిగి…
సిరులిచ్చే శ్రీలక్ష్మి ఉన్నాను
కుబెరుని అప్పడిగి…
అసలు కన్న.. వడ్డీనే
చెల్లిస్తువున్నా శ్రీహరి వడ్డీ కాసులవాడా…

గోవిందా గోవిందాయంటు నీ నామస్మరణం…
గోవిందా గోవిందాయంటు నీ నామస్మరణం…
నిత్యం చేసే భక్తుల ఇంట
ఎమి ఉండదంటా ముకుంద సిరులు పండేనంటా ఆ…

రాముడు నీవే కృష్ణుడు నీవే వైకుంఠపురధారి…
రాముడు నీవే కృష్ణుడు నీవే వైకుంఠపురధారి…
ఏమని నిన్ను పొగడేదమయ్యా
ఎల్లపుడు చూస్తు ఉండగ వేడెదమో ఓ హరి…

అలివేలుమంగా పద్మావతుల
ముద్దుల వల్లభుడా…
అలివేలుమంగా పద్మావతుల
ముద్దుల వల్లభుడా…
ఇద్దరు సతుల పొరుకు విసిగి
శిలగా మారితీవా వెంకటాచలమున నిలిచితివా ఆ…

నీ గిరినున్నా పాపనాశనం స్నానమాత్రమునచే…
నీ గిరినున్న పాపనాశనం స్నానమాత్రమునచే…
తొలగించునుగా పూర్వ పాపములు కలిగించును మాకు
శ్రీహరి సర్వ తీర్థ పుణ్యం…

నీ భక్తుడగు తొండమానుడు పిలిచినా వేనువెంటా…
నీ భక్తుడగు తొండమానుడు పిలిచినా వేనువెంటా…
నడిచితివాతడు పిలిచిన చోటుకు
నరహరి వందనము నారాయణ గోవింద శరణం…

నిత్య తీర్ధము భక్తి మార్గము కలియుగ వైకుంఠం…
నిత్య తీర్ధము భక్తి మార్గము కలియుగ వైకుంఠం…
పగలు రాత్రి తేడ తెలియని పరమపుణ్యపదం
తిరుమల నిత్య జనానందం…

బ్రహ్మ కడిగిన పదము నీదే బ్రహ్మ జ్ఞానము అది..
బ్రహ్మ కడిగిన పదము నీదే బ్రహ్మ జ్ఞానము అది..
తిమిరాలన్నీ హరియించే వెలుగు ఇచ్చునయ్యా
తిరుమల వెంకటేశ శరణం…

బ్రహ్మోత్సవమున నీ వైభోగం కన్నులపండుగయ్యా…
బ్రహ్మోత్సవమున నీ వైభోగం కన్నులపండుగయ్యా…
బ్రహ్మాది దేవతలందరూ కూడా తిరుమల వచ్చెదరు
ఓ స్వామి నిను పూజించెదరు…

ఎన్నో జన్మల పుణ్యఫలమది తిరుమల దర్శనము…
ఎన్నో జన్మల పుణ్యఫలమది తిరుమల దర్శనము…
నిన్ను చూసేడి భాగ్యము ఇంకా
వెలలేనిది స్వామి వెంకన్న వెలుగే నీవయ్యా…

మారు జన్మంటూ ఉంటే మాకు నీ తిరుమల పైనా…
మారు జన్మంటూ ఉంటే మాకు నీ తిరుమల పైనా…
రాయిగానైన పుట్టించు స్వామి రాగము పలుకునేమో
నీ సన్నిధి చిరకాలముండగను…

నీ తిరునామం ముక్తిదాయకం తిరుమల గోవిందా…
నీ తిరునామం ముక్తిదాయకం తిరుమల గోవిందా…
పరుగులు తీయు నా మనసు నీ స్మరణము చేయ గోవిందా
గోవిందా.. గోవిందా…

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like