Home » కళ్ళజోడు పిల్లగాడు (Kallajodu Pillagadu) Folk సాంగ్ లిరిక్స్

కళ్ళజోడు పిల్లగాడు (Kallajodu Pillagadu) Folk సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
737 views
Kallajodu Pillagadu Folk song lyrics

చినుకు చిన్నారి చిలుకల్లా కలువకనికి పోతుంటే
తగిలెను వాని సూపుల్లా ఏదో చేసే నన్నెందోల్లా
వెనకెనకే వస్తడోయమ్మా తనువంతా వణికే నాదమ్మ
వాడిని చూస్తేనే చాలమ్మా ముఖమంతా మురిసే నాదమ్మ

కలలో కలవరిస్తాడే కాలాన్నే మరిచేసానే
కలలో కలవరిస్తాడే కాలాన్నే మరిచేసానే
రాజవంశ అందాల ఘనుడు
నాకు నచ్చిన ముద్దుల ప్రియుడు

కళ్ళజోడు పిల్లగాడు సక్కాని సూర్యుడు
వాని కడల కండ్ల సూపులతోనే మత్తులో ముంచెను
కళ్ళజోడు పిల్లగాడు సక్కాని సూర్యుడు
వాని కడల కండ్ల సూపులతోనే మత్తులో ముంచెను

అందరిలో నవ్విస్తాడు తామరాకు వన్నెగాడు
ఆగమాగమయ్యే నాలో వాని వలలో అడుగేసాను
తీరమైన లేనే లేదు వాడి మీదనే ధ్యాసలు
మాపటేల మందారాలు పూసేనేమో నా మదిలోను

ఏమే పిల్ల అంటాడే పానమంతా దోసినాడే
ఏమే పిల్ల అంటాడే పానమంతా దోసినాడే
రాజవంశ అందాల ఘనుడు
నాకు నచ్చిన ముద్దుల ప్రియుడు

కళ్ళజోడు పిల్లగాడు సక్కాని సూర్యుడు
వాని కడల కండ్ల సూపులతోనే మత్తులో ముంచెను
కళ్ళజోడు పిల్లగాడు సక్కాని సూర్యుడు
వాని కడల కండ్ల సూపులతోనే మత్తులో ముంచెను

నిదురా ఆకలి మరిసాను తెల్లవార్లు వాని కలలు
తలవంగనే ఎదురౌతాడు ముచ్చటైన మురిపాలోడు
జాజిపూల జవాళ్లు హరివిల్లు పావురాలు
అడిగే ఏడే నీవాడంటూ విక్కిరించే నన్నే చూస్తూ

మది దోచే మన్మధుడు ఆడు నా మనసును గెలిసినోడు
మది దోచే మన్మధుడు ఆడు నా మనసును గెలిసినోడు
రాజవంశ అందాల ఘనుడు
నాకు నచ్చిన ముద్దుల ప్రియుడు

కళ్ళజోడు పిల్లగాడు సక్కాని సూర్యుడు
వాని కడల కండ్ల సూపులతోనే మత్తులో ముంచెను
కళ్ళజోడు పిల్లగాడు సక్కాని సూర్యుడు
వాని కడల కండ్ల సూపులతోనే మత్తులో ముంచెను

___________

సాంగ్ : కళ్ళజోడు పిల్లగాడు (Kallajodu Pillagadu)
నటించినవారు: ER యామిని (ER Yamini)
నిర్మాత: అశోక్ చౌదరి (Ashok chowdary)
సాహిత్యం: సాయి ఆదిత్ (Sai Adhit)
గాయకుడు: వైసు పవార్ (Vaisu pawar)
సంగీతం : శివ కె (Shiva k)
దర్శకత్వం & కొరియోగ్రఫీ : MP చరణ్.S (MP charan.s)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.