Home » శ్రీ-కాళ-హస్తి (Sri-Kala-Hasti) సాంగ్ లిరిక్స్, Kannappa | Vishnu Manchu

శ్రీ-కాళ-హస్తి (Sri-Kala-Hasti) సాంగ్ లిరిక్స్, Kannappa | Vishnu Manchu

by Lakshmi Guradasi
5.5K views
Sri-Kala-Hasti Song lyrics kannappa vishnu manchu

జనులారా వినరారా కాళహస్తి గాథ.. శ్రీ కాళహస్తి గాథ
జనులారా వినరారా కాళహస్తి గాథ.. శ్రీ కాళహస్తి గాథ
కనులారా మనసారా కనిన జన్మ ధాన్యమేకదా.. ఈ కథ
తాండవం శివ తాండవం పార్వతి పరమేశ్వరం
కురుణాకర గంగాధర నీలకందర
శంకర.. శివ శంకర..
శంకర.. అభయంకర..

జనులారా వినరారా కాళహస్తి గాథ.. శ్రీ కాళహస్తి గాథ
జనులారా వినరారా కాళహస్తి గాథ.. శ్రీ కాళహస్తి గాథ
కనులారా మనసారా కనిన జన్మ ధాన్యమేకదా.. ఈ కథ
తాండవం శివ తాండవం పార్వతి పరమేశ్వరం
కురుణాకర గంగాధర నీలకందర
శంకర.. శివ శంకర..
శంకర.. అభయంకర..

పరమ శివుని భక్తుడొకడు సాలెపురుగు జన్మనెత్తి
గుడిలో శివునికి ఓక గూడు కట్టెను
అతని భక్తి పరీక్షించి పంతముగల ముక్కంటి
నిప్పు కంటితో పెను మంట పెట్టెను
భగ భగ భగ మండే లింగము కాపాడ
సాలెపురుగు మంట దూకి ప్రాణమొదలగా
శివుడు కనికరించి హృదయాన చోటునిచ్చి
కాళహస్తి పేరు మొదట శ్రీ ని చేర్చి శివుడు
శివోహం అను నాదమే నింగి ధ్వనించే
పరమేశ్వర లీలతో నేల తరించే
నీ లీలా… శివ లీలా.. పలికేలా దీవించు నీలకందర
శంకర.. శివ శంకర..
శంభవ.. అభయంకర..

దర్పముగల సర్పమోకటి తలపై గల మణులు తెచ్చి
పరమ భక్తితో శివ పూజ చేసేను
తనదే గొప్ప పూజ యనుచు ఏనుగొకటి తొండముతో
మణులను తోసి జల సేవ సలిపెను
పగ పట్టిన నాగం తొండములో దూరే
తాల లేక ఏనుగు శిలకు మోదెను
గజము నాగుపాముల త్యాగాలను మెచ్చి
శ్రీ తో పాటు కాళహస్తి పదము నిలిపే హరుడు
శివోహం అను నాదమే నింగి ధ్వనించే
పరమేశ్వర లీలతో నేల తరించే
నీ లీలా… శివ లీలా.. పలికేలా దీవించు నీలకందర
శంకర.. శివ శంకర..
శంభవ.. అభయంకర..

సాలేడు ధారాలను ఎంగిలి అనడు శివుడు
గజము జలములు అనలేదు బురదని
పరమ హంసలందించే పంచామృతమైన సరే
అడవి బిడ్డల మధు మాంసలైన
భక్తి ఒకటి చూసి మనసెంటో తెలిసి
మూడింటికి ఆ శివుడు ముక్తి నొసగెను
ఏ భేదము లేక మోక్షలను ఇచ్చే
ఒకే ఒకడు ఈ జగతిలో పరమేశ్వరుడు
శివోహం అను నాదమే నింగి ధ్వనించే
పరమేశ్వర లీలతో నేల తరించే
నీ లీలా… శివ లీలా.. పలికేలా దీవించు నీలకందర
శంకర.. శివ శంకర..
శంభవ.. అభయంకర..

_______________

పాట పేరు: శ్రీ-కాళ-హస్తి (Sri-Kala-Hasti)
చిత్రం: కన్నప్ప (Kannappa)(Telugu)
ఫీచర్స్: అరియానా మంచు (Ariaana Manchu) & వివియానా మంచు (Viviana Manchu)
సింగర్(లు): అరియానా మంచు (Ariaana Manchu) & వివియానా మంచు (Viviana Manchu)
సంగీతం: స్టీఫెన్ దేవస్సీ (Stephen Devassy)
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ (Suddala Ashok Teja)

ఇటువంటి మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.