Ammulu folk song lyrics Nikhil Malyakal

అమ్ములు (Ammulu) సాంగ్ లిరిక్స్, Nikhil Malyakal

by Lakshmi Guradasi

రాయే రాయే…. అమ్ములు…
పట్టురైక చీర కొనివెడతా
రాయే రాయే రాయే రాయే
మంగళరమని వంకవెట్టకే
రాయే రాయే రాయే రాయే….

పిల్ల.. పిల్ల… పిల్ల..
పిల్ల.. పిల్ల… పిల్ల..
హే రాయే రాయే రాయే పిల్ల
నా గుండె మీద నీ బొట్టుబిల్ల
పచ్చబొట్టేసిపోయే పిల్ల..

ఏ.. రానా రానా రానా పిల్లగా
నీ గుండెమీద నా బొట్టుబిల్ల
పచ్చబొట్టేసిపోనా పిల్లగా..

నీ నల్లనల్లని కళ్ళ కాటుకైతనే పిల్ల
నీ మాయమాటలే నమ్మి మోసపొనులే పిల్లగా

ఏ రాయే రాయే ఎహె రాయే రాయే
ఎహె రాయే రాయే రాయే రాయే
రాయే రాయే రాయే పిల్ల
నా గుండె మీద నీ బొట్టుబిల్ల
పచ్చబొట్టేసిపోయే పిల్ల..

ఏ.. రానా రానా రానా పిల్లగా
నీ గుండెమీద నా బొట్టుబిల్ల
పచ్చబొట్టేసిపోనా పిల్లగా..

నీ సీర కొంగుకే సుట్టుకొని పానమాగమాయెనే పిల్ల
గవరాయెనే పిల్ల.. గింత జాలి చూపవే పొల్ల
నీ ఆంగి గుండికి సిక్కుకొని సూపు సిన్నబోయెనోయ్ పిల్లగా
గుండె కొట్టుకున్నాదోయ్ పిల్లగా.. ఏడ జారిపోతనో మల్ల..

నా సంటిపోల్లవే నా సెయ్యివట్టవే
నా ఇంటి ముంగిట వచ్చి ముగ్గుపెట్టవే….
ఓ సంటిపొల్లగా నీ సెయ్యివట్టను
ఈ మంది ముంగిట నన్ను లొల్లిచేయకు….

రాయే రాయే రాను రాను
రాయే రాయే రాయే రాయే రాయే
రాయే రాయే రాయే పిల్ల
నా గుండె మీద నీ బొట్టుబిల్ల
పచ్చబొట్టేసిపోయే పిల్ల..

ఏ.. రానా రానా రానా పిల్లగా
నీ గుండెమీద నా బొట్టుబిల్ల
పచ్చబొట్టేసిపోనా పిల్లగా..

నా బండి ఎక్కవే ఒప్పుకొని
జోరుమీద పోదామే పిల్ల
లొల్లిసేయకే పిల్ల.. తాళిబొట్టు కడ్తనే పొల్ల..

నీ బండి ఎక్కితే ఒప్పుకొని
ఊరుదాటిపోతాది పిల్లగా
కొరికెక్కువైతది పిల్లగా.. ఏడ సొంతమైతనో మల్ల..

ఏ తిండివట్టదే నా మాట నమ్మవే
ఓ ముద్దుపెట్టవే నీ పెనివిటైతానే…
నా ఒంటిమీదనే నీ కన్ను ఎప్పుడు
నా కొంపముంచకు నన్ను చావగొట్టకు..

రాయే రాయే.. రాయే రాయే
రాయే రాయే రాయే రాయే రాయే
రాయే రాయే రాయే
నా గుండె మీద నీ బొట్టుబిల్ల
పచ్చబొట్టేసిపోయే పిల్ల..

ఏ.. రానా రానా రానా పిల్లగా
నీ గుండెమీద నా బొట్టుబిల్ల
పచ్చబొట్టేసిపోనా పిల్లగా..
పిల్ల.. పిల్ల… పిల్ల..
పిల్ల.. పిల్ల… పిల్ల..

సాంగ్ క్రెడిట్స్ :

సాంగ్ : అమ్ములు (AMMULU)
నటీనటులు: నిఖిల్ మాల్యాకల్ (Nikhil Malyakal (Bigg Boss Fame)), సోనియా సురేష్ (Soniya Suresh)
నిర్మాత: శ్రీ విద్యా కృష్ణ (Sri Vidya Krishna) (SSV Music Studios)
సంగీత దర్శకుడు: SS దినవహి (SS Dinavahi)
గీత రచయిత: మధు కిరణ్ మద్దికుంట (Madhu Kiran Maddikunta)
కొరియోగ్రాఫర్: గోవింద్ కోటప్ (Govind Kotap)
గాయకులు: నజీరుద్దీన్ (Nazeeruddin) & అమిత (Amitha)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like