Home » సూడరాదే ప్రమీలా సాంగ్ లిరిక్స్ – జానపద పాట

సూడరాదే ప్రమీలా సాంగ్ లిరిక్స్ – జానపద పాట

by Vinod G
1.3K views
sudaradhe prameela folk song lyrics

పిల్లా నీలినిమ్మల వాగు దాటి నువ్వు నన్ను
సూడరావే ప్రమీల నన్ను సేరరావే ప్రమీల
నీలినిమ్మల వాగు దాటి నిన్ను నేను
సూడలేను బావయ్యో నిన్ను సేరలేను బావయ్యో

సూడరావే ప్రమీల నన్ను సేరరావే ప్రమీల
చూడలేను బావయ్యో నిన్ను చేరలేను బావయ్యో

పిల్లా నీలినిమ్మల వాగు దాటి నువ్వు నన్ను
సూడరావే ప్రమీల నన్ను సేరరావే ప్రమీల
నీలినిమ్మల వాగు దాటి నిన్ను నేను
చూడలేను బావయ్యో నిన్ను చేరలేను బావయ్యో

అబ్బా జొన్నసేనుకు పురుగుమందు గొడతావుంటా
జాలి జూపే ప్రమీల జర జతనుగోరె ప్రమీల

జొన్నసేనుల పురుగుమందు గొడతావున్న
జాలిజూప బావయ్యో జతగ రాను బావయ్యో
జాలి జూపే ప్రమీల జర జతనుగోరె ప్రమీల
జాలిజూప బావయ్యో జతగ రాను బావయ్యో

పిల్లా నీలినిమ్మల వాగు దాటి నువ్వు నన్ను
సూడరాదే ప్రమీల నన్ను సేరరాదే ప్రమీల
అహ నీలినిమ్మల వాగు దాటి నిన్ను నేను
చూడలేను బావయ్యో నిన్ను చేరలేను బావయ్య

గా పత్తిసేనులో నేను దంతే బడతావుంట
తోడురావే ప్రమీల తోడుండిపోవే ప్రమీల

ప ప ప పత్తిసేనులో నువ్వు దంతే బడతావున్న
తోడురాను బావయ్యో తోడుండిపోను బావయ్యో
తోడురావే ప్రమీల తోడుండిపోవే ప్రమీల
తోడురాను బావయ్యో తోడుండిపోను బావయ్యో

అహ నీలినిమ్మల వాగు దాటి నువ్వు నన్ను
సూడరాదే ప్రమీల నన్ను సేరరాదే ప్రమీల
అరె నీలినిమ్మల వాగు దాటి నిన్ను నేను
చూడలేను బావయ్యో నిన్ను చేరలేను బావయ్యో

మా అమ్మనాయన తోటి మీవోళ్ళనొప్పించి
చేసుకుంటా ప్రమీల పెళ్ళి చేసుకుంటా ప్రమీల

అహ అంతమంచి గడియలెప్పుడున్నాయని
ఎదురుచూస్త బావయ్యో ఏడడుగులేస్తా బావయ్యో
చేసుకుంటా ప్రమీల పెళ్ళి చేసుకుంటా ప్రమీల
ఎదురుచూస్త బావయ్యో ఏడడుగులేస్తా బావయ్యో
ఎదురుచూస్త బావయ్యో ఏడడుగులేస్తా బావయ్యో


👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కావాలంటే తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.