Home » తిన్న తిరం పడుతలే సాంగ్ లిరిక్స్ – జానపద పాట

తిన్న తిరం పడుతలే సాంగ్ లిరిక్స్ – జానపద పాట

by Vinod G
2.5K views
thinna thiram paduthale folk song lyrics

తిన్న తిరం పడుతలే
గూసున్న తిరం పడుతలే
ఏడున్నా తిరం పడుతలే
ఎవలున్న తిరం పడుతలే
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా

నువ్వు సిర్రసిటుక పట్టి
డప్పుళ్ల దరువులేస్తే
తనవంతా కాటకలిసే
ప్రేమ ఇత్తునాలు మొలిసే
గప్పటి నుండే నాకు తిప్పలు మొదలాయీ నొల్ల
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా

నువ్వు నేను దూరమాయి
ఏడాది నరుదుమోయి
పొదమాపు ఎదురుసూపు
జాడన్న తెలవదోయి
గిట్లా గోసలు పెట్టా నీకు ఎట్లా మనసాయే పిలగా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా

రవ్వంత గూసులాట
అగ్గోలే రాజుకుంది
ఇక మాట మాట పెరిగే
ఇద్దరి మనసు ఇరిగే
కొవ్వొత్తి వోలె కరిగే కోపాలు ఎందుకోయి పిలగా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా

పసిదాన్ని కాదా నేను
పగబట్టబోకు నన్ను
పంతాలు ఇడసపెట్టు
ఇకనన్న సేయి పట్టు
నా గుండెలో బాధ నీ గుండెకు గురుతోస్తలేదా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా


ఇలాంటి మరిన్ని వాటికోసం చూడండి తెలుగురీడర్స్ లిరిక్స్

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.