ఎందుకంట జోడ (ఎంత కష్టమైన) సాంగ్ లిరిక్స్ – Endukanta Joda Song Lyrics in Telugu, 7th Sense | TeluguReaders 

by Manasa Kundurthi

ఎందుకంట జోడ గుండెల్లోన జ్వాల
సర్వం మనం కోలుపోయామే
ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే
మళ్ళి బలం పుంజుకుంటామే

ఎదురొచ్చేది ఎవరంట ధైర్యం ఉంటే నీ వెంట
శౌర్యం చూపి అడుగేద్దాం పద నేస్తం
పోయెదేది లేదంట కన్నీరేల నీ కంట
కష్టంలోంచే పుడుతుంది ఘన విజయం

సంద్రపు అలలై పడదాం
ఆశల మొలకై పుడదాం
మళ్ళి మళ్ళి చేద్దాం సమరం
ఇంకా ఇంకా ఎగసే కసితో గుండెలు మరిగే
సైన్యం మనదే మనదే పదరా

ఎందుకంట జోడ గుండెల్లోన జ్వాల
సర్వం మనం కోలుపోయామే
ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే
మళ్ళి బలం పుంజుకుంటామే

మనసుని ఓ క్షణం పదునెడితే మనం అనుకుంది జరగదా
సహనంతో మనం ఒకటైతే వీధి అయినా జడవదా
కాలం ఉందిరా గుండె బలం ఉందిరా ఇదే తరుణం తలపడు
ప్రతి అడుగడుగు ఒక పిడుగైనా తలవంచక నిలబడు
ఒకే పదం ఒకే స్వరం అదే అదే మన లక్ష్యంగా
నిరంతరం తపించితే ఉషోదయం ఇక తప్పదురా

మెడ మీదే చూర కత్తులని మనం అనుక్షణం భరించిన
మన భాషే ఒక ఆయుధంగా మన భవితను మలచుదా
పొగమంచే అః అలుముకుంటే ఆ సూర్యున్నే గెలవదా
ఒక పొగ మేఘం పెను ఉప్పెనలా మన కన్నుల పుట్టదా
నిరాశని జయించితే ధీగంతమైన దిగి రాదా
సమిష్టిగా శ్రమించితే స్వతంత్రమే మన సిరి కాదా

ఎదురొచ్చేది ఎవరంట ధైర్యం ఉంటే నీ వెంట
శౌర్యం చూపి అడుగేద్దాం పద నేస్తం
పోయెదేది లేదంట కన్నీరేల నీ కంట
కష్టంలోంచే పుడుతుంది ఘన విజయం

సంద్రపు అలలై పడదాం
ఆశల మొలకై పుడదాం
మళ్ళి మళ్ళి చేద్దాం సమరం
ఇంకా ఇంకా ఎగసే కసితో గుండెలు మరిగే
సైన్యం మనదే మనదే పదరా

____________________

సినిమా – 7th సెన్స్ (7th Sense)
గాయకులు – బలరామ్ (Balram), నరేష్ అయ్యర్ (Naresh Iyer), సుచిత్ సురేశన్ (Suchith Suresan)
సంగీతం – హారిస్ జయరాజ్ (Harris Jayaraj)
లిరిక్స్ – భువన చంద్ర (Bhuvana Chandra)
దర్శకుడు – ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss)
నటీనటులు – సూర్య (Suriya), శృతి హాసన్ (Shruti Haasan)
నిర్మాత – ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like