వానోచ్చే వనుకొచ్చే ( Vanoche Vanukoche ) సాంగ్ లిరిక్స్ – Folk song 

by Lakshmi Guradasi

వానోచ్చే వనుకొచ్చే నా గుండెలోన
వయ్యారి పిల్ల నా తోడు రాయ్యే
వనుకొస్తే నాకేలా ఓ సుందరయ్య
నాకు దూరంగుండు ఓరి బావయ్య

పాలంటి నీ లేత బుగ్గలు
ముద్దోస్తున్నయే
హత్తుకొమ్మని నా చేతులే
తొందర పెడుతున్నాయే

చిలిపిగా చూసేటి నీ చూపులు
నన్నే గుచ్చెనురా
మాయలు చేసే నీ మాటలతో
నన్నే ముంచకురా

వానోచ్చే వనుకొచ్చే నా గుండెలోన
వయ్యారి పిల్ల నా తోడు రాయ్యే
వనుకొస్తే నాకేలా ఓ సుందరయ్య
నాకు దూరంగుండు ఓరి బావయ్య

మల్లెపువ్వులే నువ్వు నవ్వుతుంటే
మంచిగున్నవే ఓ ముద్దుగుమ్మ
మనసైనాది నీ మీదే
మనువాడుకుంటాను రాయ్యే

మనసైనాది నీ మీదే
మనువాడుకుంటాను రాయ్యే

నేను నవ్వుతుంటే మంచిగుంటనాన్ని
నాకు తెలుసురా ఓరి పిల్లోడా
మాయమాటలే ఆపు
పాడబోకు నా ముందు సోకు

మాయమాటలే ఆపు
పాడబోకు నా ముందు సోకు

నా గుండెలోన గుడి కట్టిన దేవత నువ్వేనే
నా తోడు ఉంటె జీవితమే ఎంతో సంతోషమే

వానోచ్చే వనుకొచ్చే నా గుండెలోన
వయ్యారి పిల్ల నా తోడు రాయ్యే
వనుకొస్తే నాకేలా ఓ సుందరయ్య
నాకు దూరంగుండు ఓరి బావయ్య

నెమలి నడకే పిల్ల నువ్వు నడిచే నడక
ఆ నడకలోన ఓ చిన్న మడత
నన్నే లాగేస్తావుందే
నీ వైపే రామంటవుందే

నన్నే లాగేస్తావుందే
నీ వైపే రామంటవుందే

మాటల మాటలు కడుతున్నావు
నా మనసునే నువ్వు దోచుకోలేవు
నా తోవలో నువ్వు రాకు
నన్ను అల్లరి చెయ్యమాకు

నా తోవలో నువ్వు రాకు
నన్ను అల్లరి చెయ్యమాకు

ఏడేడు జన్మలు తోడుంటనే
నన్నే నమ్మరాదే
నన్నే నమ్మి నా తోడు వస్తే
నీ నీడల్లే నేనుంటనే

వానోచ్చే వనుకొచ్చే నా గుండెలోన
వయ్యారి పిల్ల నా తోడు రాయ్యే
వనుకొస్తే నాకేలా ఓ సుందరయ్య
నాకు దూరంగుండు ఓరి బావయ్య

_______________________________________________

పాట : వానోచ్చే వనుకొచ్చే ( Vanoche Vanukoche )
నటుడు : యమునా తారక్ (Yamuna Tharak ) – సందీప్ నిర్వాణ్ (Sandeep Nirvan)
సాహిత్యం: సిద్దూ యాదవ్ (Siddu Yadav)
గాయకులు: సుమన్ బద్నకల్ (Suman Badnakal ) – శ్రీనిధి (Srinidhi)
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like