Home » మైదా వాడడం ఎందుకు మంచిది కాదో తెలుసా ?

మైదా వాడడం ఎందుకు మంచిది కాదో తెలుసా ?

by Nikitha Kavali
0 comment

ఇప్పుడు అందరం పిజ్జాలు, బర్గర్లు, నూడుల్స్ లు అంటూ తెగ ఇష్టం గా తినేస్తున్నాము. కానీ వాటి వాళ్ళ మన ఆరోగ్యానికి ఎంత హాని కలుగుతుందో మర్చిపోతున్నాం. అసలు ఎక్కువగా ఈ పదార్థాలను చెయ్యడానికి వాడేది మైదా. మైదా మన ఆరోగ్యానికి చేదు చేసేది అని తెలిసిన మనం దానిని వాడటం మాత్రం ఆపట్లేదు.

మైదా ను ఎలా తయారు చేస్తారు: 

మిల్లింగ్ యంత్రంలో రోలర్ల ద్వారా గోధుమలు పంపబడతాయి. ఈ ప్రక్రియలో గోధుమ గింజలు చిన్న ముక్కలుగా విరిగిపోతాయి మరియు ఎండోస్పెర్మ్ (స్టార్చ్ భాగం) ఊక మరియు సూక్ష్మక్రిమి (పోషకాలు అధికంగా ఉండే లోపలి భాగం) నుండి వేరు చేయబడతాయి.

వేరు చేయబడిన ఎండోస్పెర్మ్ చక్కటి పొడిగా గ్రౌన్దేడ్ చేయబడుతుంది. కావలసిన సున్నితత్వాన్ని సాధించడానికి ఈ పొడి మరింత ప్రాసెస్ చేయబడుతుంది. కొన్ని సందర్భాల్లో మైదాను తెల్లగా చేయడానికి కొన్ని రసాయనిక పదార్థాలతో బ్లీచ్ చేస్తారు.

మైదా ను వాడడం వలన కలిగే నష్టాలూ:

మనం అంతకు ముందు రోజులలో గమనించి నట్టు అయితే సినిమా పోస్టర్లను గోడల మీద అంటించడానికి మైదా ను నీళ్లల్లో ఉడకబెట్టి చిక్కటి ద్రవం లాగా చేసి పోస్టర్లను అంటించే వాళ్ళు. మైదా లో పోషక పధారితలు చాలా అంటే చాలా తక్కువ మోతాదు లో ఉంటాయి మరియు ఇందులో కార్బోహైడ్రాట్లు చాల అధికంగా ఉంటాయి. అందువలన మైదా ను ఎక్కువగా తీసుకోవడం వలన ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, జీర్ణ సమస్యలు ఇలా మొదలైన అనారోగ్యాలు అన్ని మన వసం అవుతాయి.

మొత్తంగా చెప్పాలి అంటే మైదా నేది అనేది ఒక నిర్జీవమైన ఆహార పదార్థం. అదానిని మన ఆహరం లో కలిపి తీసుకుంటే ఆస్పత్రుల పాలవడం కచ్చితం. ఇకనైన మీ పిల్లలకి ఈ బయట చేసిన ఆహార పదార్థాలు కొనివ్వకండి. ఇంట్లోనే ఆరోగ్యకరమైన వంటలను మీరే చేసి పెట్టండి.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment