Home » వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణత్మికే సాంగ్ లిరిక్స్ – సరస్వతి మాత స్తోత్రం

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణత్మికే సాంగ్ లిరిక్స్ – సరస్వతి మాత స్తోత్రం

by Manasa Kundurthi
0 comments
Vaishnavi Bhargavi song lyrics telugu

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణత్మికే
వింధ్య విలాశిని వారాహి త్రిపురాంబికే

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణత్మికే
వింధ్య విలాశిని వారాహి త్రిపురాంబికే

భవతి విధ్యాం దేహి భగవతి సర్వార్ధసాధికే
సత్యాద్రచంద్రికే
మాంపాహీ మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మయాత్మికే
మాంపాహీ మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మయాత్మికే

ఆపాత మధురము సంగీతము
అంచిత సంగాతము
సంచిత సంకేతము

ఆపాత మధురము సంగీతము
అంచిత సంగాతము
సంచిత సంకేతము

శ్రీ భరతీ క్షీర సంప్రాప్తము
అమృత సంపాతము సుకృత సంపాకము

శ్రీ భరతీ క్షీర సంప్రాప్తము
అమృత సంపాతము సుకృత సంపాకము

సరిగమ స్వరధుని సారవరూధినీ
సామసునాధ వినోదిని
సకలకళ కళ్యాణి సుహాశిని
శ్రీ రాగాలయ వాసిని
మాం పాహీ మకరంద మందాకిని
మాం పాహీ సుజ్ఞాన సంవర్ధిని

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణత్మికే
వింధ్య విలాశిని వారాహి త్రిపురాంబికే

ఆలోచనామృతము సాహిత్యమూ
సహిత హిత సత్యము శారదా స్తన్యము
ఆలోచనామృతము సాహిత్యమూ
సహిత హిత సత్యము శారదా స్తన్యము

సారస్వతాక్షర సారధ్యము
జ్ఞనసామ్రాజ్యము జన్మసాఫల్యమూ
సారస్వతాక్షర సారధ్యము
జ్ఞనసామ్రాజ్యము జన్మసాఫల్యమూ

సరసవక్షోభిని సారసలోచినీ
వాణీపుస్తకధారినీ వర్ణాలంకృత వైభవశాలిని
వరకవితా చింతామణి
మాం పాహీ సారోగ్య సంధాయినీ
మాం పాహీ శ్రీచక్ర సింహాసినీ..

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణత్మికే
వింధ్య విలాశిని వారాహి త్రిపురాంబికే
భవతి విధ్యాం దేహి భగవతి సర్వార్ధసాధికే
సత్యాద్రచంద్రికే
మాంపాహీ మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మయాత్మికే

_____________________

పాట: వైష్ణవి భరగవి (Vaishnavi Bhargavi)
ఆల్బమ్: స్వాతికిరణం (Swathi Kiranam)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి (Sirivennela Sitarama Sastry)
స్వరకర్త:
కె.వి.మహదేవన్ (K.V.Mahadevan)
ఆర్టిస్ట్: వాణీ జయరామ్ (Vani Jayaram)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.