Home » వైకుంఠ వాసుడమ్మ (Vaikunta Vasudamma) సాంగ్ లిరిక్స్

వైకుంఠ వాసుడమ్మ (Vaikunta Vasudamma) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
746 views
Vaikunta Vasudamma song lyrics

వైకుంఠ వాసుడమ్మ శ్రీవేంకటేసుడమ్మ
ఏడుకొండల్లా మీద భక్తుల నేలంగా వెలసే
చుక్కలను తాకే కొండలపై మన వెంకన్న
చూడ చక్కంగా వెలిసేను మన వెంకన్న !!వైకుంఠ!!

అలివేలు మంగ తల్లి అందాల విబోడోయమ్మ
అవని అంత యేలేటి దేవాది దేవుడమ్మ
నలు దిక్కులు కాచేటి నారాయణ మూర్తేనమ్మ
కలిబాధలు తొలగించుటకు మన వెంకన్న
కలియుగాన అవతరించేనే మన వెంకన్న !!వైకుంఠ!!

పాలకడలిలోన పాముల పాన్పు మీద
పవనించే దేవుడమ్మ ఆ పరందముడమ్మ
భువి భారం తీర్చుట కొరకే భువి పైన వెలిసాడమ్మ
ఎన్నేనో మహిమలు తోని..మన వెంకన్న
ఏడూ కొండల్లా వెలిసేను మన వెంకన్న. !! వైకుంఠ!!

త్రేతాయుగము నందు శ్రీరాముడు అతడేనమ్మ
ద్వాపరయుగము నందు శ్రీకృష్ణుడు అతడేనమ్మ
కలియుగమందున వెంకటేశుడై వెలిసేను
దశవతారుడు కాదమ్మ మన వెంకన్న
ధరణి పైన వెలిసిన దేవుడే మన వెంకన్న !!వైకుంఠ!!

See Also plz click on this: yedukondala-venkateswara-song-lyrics

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.