3
ఇంట్లో ఉండే వాటితోనే చాల సులభంగా చేసుకోగలిగే వంటకం ఈ తిమ్మనామ్ బియ్యం, పచ్చి కొబ్బరి, బెల్లం, పాలు ఉంటె చాలు 15 నిమిషాలలోనే రుచికరమైన స్వీట్ తయారైపోతుంది. ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుందాం రండి.
కావలసినవి:
బియ్యం-1/3 కప్
పచ్చి కొబ్బరి- ఒక కొబ్బరి గిన్నె
పాలు – అర లీటర్
బెల్లం-1 గడ్డ
నెయ్యి-4 స్పూన్లు
జీడీ పప్పు – 50 గ్రాములు
యాలకులు – 5
తయారుచేసే విధానం:
- ముందుగా బియ్యంను నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు ఈ నానిన బియ్యంను పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టించి మెత్తగా పేస్ట్ లా చేసుకోండి.
- ఒక మందపాటి కడాయి తీసుకొని అర లీటర్ పాలు పోసి దాంట్లో ఈ బియ్యం, పచ్చికొబ్బరి పేస్ట్ ను వేసుకొని బాగా దగ్గర అయ్యేవరకు ఉడకబెట్టండి.
- సగం బెల్లం గడ్డను తీసుకొని మెత్తగా నలగకొట్టి ఆ ఉడుకుతున్న మిశ్రమం లో వేయండి.
- క ఇప్పుడు జీడిపప్పులను నెయ్యి లో వేసి బాగా వేయించి ఆ ఉడకబెట్టిన మిశ్రమం లో కలపండి.
- కొద్దిగా చిన్న చిన్న కొబ్బరి పలుకులు, యాలకుల పొడితో లైట్ గా గార్నిష్ చేసుకోండి.
ఇంతేను అండి సులభంగా తిమ్మనం రెడీ అయిపొయింది.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.