Home » పడిగాపులో తలదాచుతూ (Padigapulo) సాంగ్ లిరిక్స్ | Dear Kavya

పడిగాపులో తలదాచుతూ (Padigapulo) సాంగ్ లిరిక్స్ | Dear Kavya

by Lakshmi Guradasi
0 comments

గుండెల్లో ఈ సందళ్లు వచ్చాయే నీ వల్లేనా…
కన్నుల్లో ఈ వెన్నెల్లు తెచ్చింది నీ నవ్వే నా…
ఏదో ఊసే చెప్పాలన్న కల్లోలాలే రాబోతున్న
మైకం దాటి వింటుందా హృదయం…
ఇలా నాతో నువ్వుంటున్న క్షణం ఎంతో బాగుందంటూ
తనే ఆగి చూస్తుందా సమయం…

పడిగాపులో తలదాచుతూ గడిచాయిలే ఇన్ని రోజులు
ఒక క్షణములే ఒక యుగములా ప్రేమా…
చెలి రాకతో చెలి మాటతో మురిసాయిలే చిరునవ్వులా
ఎద తేలడం తొలిసారి చూస్తున్నా….

నిన్ను చూసిలా నా మనసిలా తెగ పెంచుకున్న ప్రేమని…
ఈ నాడిలా ఈ చెలిమిలో తను పంచుతుందా సగమని…
ఇన్నాళ్ళ దూరం చేరిందా తీరం నాకున్న భారం తీరింది తరుణం…
నా నుంచి నిన్ను నీ నుంచి నన్ను ఏవేల ఎవరు విడదీయలేదు
నాదన్న ప్రాణం నీదంటూ తెలుసుకొని…

ఎన్నో ఎన్నో అందామన్న చాల్లే నాయి భాషే చిన్న
సడే నీతో పలికితే నయనం…
కన్ను కన్ను కలిసే వేళ మాయం కావా నింగి నేల
ఇలా ఉంటే నువ్వూ కలకాలం…

పడిగాపులో తలదాచుతూ గడిచాయిలే ఇన్ని రోజులు
ఒక క్షణములే ఒక యుగములా ప్రేమా…
చెలి రాకతో చెలి మాటతో మురిసాయిలే చిరునవ్వులా
ఎద తేలడం తొలిసారి చూస్తున్నా….

___________________

Webseries : Dear Kavya (డియర్ కావ్య)
నటీనటులు: Chandana Payaavula (చందన పాయవుల), KannKannaa (కన్నా)
పాట స్వరపరచినవారు : ప్రియేష్ మోతుకూరి (Priyesh Mothukuri)
గాయకుడు: షణ్ముఖ భరద్వాజ్ (Shanmukha Bharadwaj )
గీత రచయిత: ప్రబాత్ (Prabath)
రచన & దర్శకత్వం: సాయి రామ్ కృష్ణ (Sai Ram Krishna)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి .

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.