ఒకానొక రోజు రాణి అనే అమ్మాయి వాళ్ళ నాన్నతో పాటు పొలంలోకి వెళ్ళింది. అక్కడ ఆమె ఒక బంజరు పొలంలో ఒంటరిగా నిలబడి ఉన్న చెట్టును చూసి ఆ చెట్టుకిందకు వెళ్లి ఆడుకోవడం మొదలుపెట్టింది. అలా ఆడుకుంటున్న రాణికి చిన్నగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అప్పుడు రాణి పరిశీలనగా చూడగా ఆ చెట్టు ఏడుస్తుందని రాణికి అర్థమైంది. అప్పుడు రాణి ఆ చెట్టును ఏమైందని అడగగా, దానికి సమాధానంగా ఆ చెట్టు మిగతా చాల చెట్లు ఒకప్పుడు నా చుట్టూ ఉండేవని, మేమందరం స్నేహంగా ఉండేవారమని కానీ ఇప్పుడు వారందరూ నరికివేయబడ్డారని చెట్టు రాణితో చెప్పి బాధపడింది.
రాణి ఆ ఆ ఒంటరి చెట్టు బాధను చూసి ఆ చెట్టు చుట్టూ విత్తనాలు నాటి దానికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే విత్తనాలు నాటి రోజూ వాటికి నీళ్లు పోసి సంరక్షించేది. ఇలా చేస్తుండగా విత్తనాలు మొలకలుగా పెరిగాయి, త్వరగానే ఆ మొలకలు పెద్దవై చెట్టుకు కొత్త స్నేహితుల కుటుంబం ఏర్పడింది.
తరువాత ఆ చెట్టు రాణికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా అంది “నా వేర్లు ఇప్పుడు బలంగా ఉన్నాయని, నేను పొలంలో ఉన్న అన్ని జీవులకు నీడను మరియు ఆశ్రయాన్ని అందించగలనని చెప్పింది.” ఆ మాటలు విన్న రాణి చాల సంతోషించింది.
నీతి: ప్రకృతికి సహాయం చేయడం అనే మనం తీసుకునే చిన్న చర్య పెద్ద మార్పును కలిగిస్తుంది. అలాగే ప్రకృతిని, భూమిని జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.
మరిన్ని ఇటువంటి నీతికథల కోసం తెలుగు రీడర్స్ నీతి కథలు ను చూడండి.