Home » త్వరలోనే ఫ్రీ ప్లాన్ తో నెట్‌ఫ్లిక్స్‌

త్వరలోనే ఫ్రీ ప్లాన్ తో నెట్‌ఫ్లిక్స్‌

by Shalini D
0 comments

త్వరలో నెట్‌ఫ్లిక్స్‌ ఫ్రీ ప్లాన్? నెట్‌ఫ్లిక్స్‌ త్వరలో ఓ ఉచిత ప్లాన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యూజర్లు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే కంటెంట్ చూడొచ్చు. అయితే వీడియో మధ్యలో వచ్చే యాడ్స్ కూడా చూడాల్సి ఉంటుంది. ఆసియా, ఐరోపా మార్కెట్లలో ఎంపిక చేసిన చోట్ల ఈ ప్లాన్‌ను తీసుకురావొచ్చని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. భారత్‌లో తీసుకురావడంపై సంస్థ స్పష్టతనివ్వనప్పటికీ ప్రయోగాత్మకంగా పరిశీలించొచ్చని సమాచారం.

ఈ ప్లాన్ ద్వారా యూజర్లు ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండానే ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల ద్వారా ఆదాయం పెంచుకునే అవకాశాలు పరిశీలిస్తోంది నెట్ఫ్లిక్స్. ఈ ప్లాన్లో ప్రకటనలతో కూడిన స్ట్రీమింగ్ ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌ ఉన్న ఆదరణ దృష్ట్యా ఫ్రీగా అందిస్తే ఎక్కువమంది వీక్షిస్తారని తద్వారా యాడ్ రెవెన్యూ పెంచుకోవచ్చనేది కంపెనీ ఆలోచనగా ఉంది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ వార్తలును సందర్శించండి.

You may also like

Leave a Comment