Home » అంజన్నా నీ కొండ గట్టుకు రాని పాట లిరిక్స్ | Anjanna nee kondagattu ku rani

అంజన్నా నీ కొండ గట్టుకు రాని పాట లిరిక్స్ | Anjanna nee kondagattu ku rani

by Lakshmi Guradasi
0 comments
Nee Kondakurani Anjanna lyrics bhajan

స్వామి అంజన్న నీ కొండ గట్టుకు రాని ఈ కాళ్ళు ఎందుకు.. అంజన్న నీ కొండ గట్టుకు రాని..
అంజన్న నీ కొండ గట్టుకు రాని ఈ కాళ్ళు ఎందుకు.. అంజన్న నీ కొండ గట్టుకు రాని..

అంజన్న నీ రూపం చూడలేని ఈ కన్నులెందుకు.. అంజన్న రూపం చూడలేని…

కోటి జడల ముక్కంటి దేవుని వరమందు పుట్టిన వనర వీర
చిన్న నాడే ఎగిరి సూర్యుని మింగిన అతి బలవంత అంజనీ తనయ
అతి బలవంత అంజనీ తనయ…

స్వామి అంజన్న నీ పూజలు చేయ్యలేని ఈ చేతులెందుకు.. అంజన్న నీ పూజలు చేయ్యలేని..

సూర్యని చెంత విద్యలు నేర్చి సుగ్రీవుని చెంత మంత్రిగా చేరి
నీ గురువు రాముడ్ని అడవిలో కలిసి రాముడి కోసమే నా ప్రాణం అన్నావు
రాముడి కోసమే నా ప్రాణం అన్నావు

అంజన్న నీ మాలలు వేయ్యలేని ఈ కంఠమెందుకు.. అంజన్న నీ మాలలు వేయ్యలేని…

సీతమ్మ జాడకు నడుము గట్టినావు ఏడు సముద్రాలూ ఎగిరి దూకినావు
లంకినమ్మను చంపి లంకలోన దూకి సీతను చూసిన రామ దూతవయ్యా
సీతను చూసిన రామ దూతవయ్యా

అంజన్న నీ నామం తలువలేని ఈ నాలుక ఎందుకు.. అంజన్న నీ నామం తలువలేని ..

రావణసూరిని తోటలు వీకి రావణసూరిని కోటలు కాల్చి
బంగారు లంకను భస్మము చేసిన బహు బలవంత బ్రహ్మ రూప ..
బహు బలవంత బ్రహ్మ రూప..

అంజన్న నీ దిక్షలు చెయ్యలేని ఈ దేహమెందుకు.. అంజన్న నీ దిక్షలు చెయ్యలేని ..

వారంవారంనాడు మంగళవారం నాడు నిండొక్క పొద్దులు నీకు చేసేము
కొండగట్టుకు వచ్చి నీ పూజలు చేసి గండ దీపాలతొ గణముగా కొలిసేము
గండ దీపాలతొ గణముగా కొలిసేము

అంజన్న నిన్ను చూడలేని కళ్ళు అవి జలజాల గుండ్లు.. అంజన్న నిన్ను చూడలేని కళ్ళు

అంజన్న నీ రూపం చూడలేని ఈ కన్నులెందుకు.. అంజన్న నీ రూపం చూడలేని

See Also plz click on this: deepala-kanthullo-daga-daga-merise-anjanna-lyrics
tolipoddu-podupu-teeru-anjanna-lyrics
kala-kalala-kada-anjanna-song-lyrics
gallu-gallu-gajjela-motha-song-lyrics
ooregi-ravayya-hanuma-song-lyrics-sri-anjaneyam

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.