Home » మేమే ఇండియన్స్ (Meme Indians) సాంగ్ లిరిక్స్ – ఖడ్గం (Kadgam)

మేమే ఇండియన్స్ (Meme Indians) సాంగ్ లిరిక్స్ – ఖడ్గం (Kadgam)

by Vinod G
0 comments
meme indians song lyrics kadgam

హుమ్…

తికమక పెట్టె అమాయకత్వం..

చక చక లాడే వేగం..

అలాగ ఉంటాం.. ఇలాగ ఉంటాం..

ఆకతాయిలం మేము..

హే..చెప్పేదేదో అర్థమయ్యేటట్టు చెప్పారా..

అరే భాయ్ ఇస్ట్రైట్ గానే చెప్తా ఇనుకో..

హే సత్యం పలికే హరిశ్చంద్రులమ్..
సత్యం పలికే హరిశ్చంద్రులమ్..
అవసరానికో అబద్ధం..
నిత్యం నమాజు పూజలు చేస్తాం
రోజు తన్నుకు చస్తాం..

హాయ్ సత్యం పలికే హరిశ్చంద్రులమ్..
అవసరానికో అబద్ధం..
నిత్యం నమాజు పూజలు చేస్తాం
రోజు తన్నుకు చస్తాం..

నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం
నమ్మడమెరా కష్టం..
అరె ముక్కు సూటిగా ఉన్నది చెప్తాం
నచ్చకుంటే నీ ఖర్మం..
అరే కష్టమొచ్చినా కన్నీళ్లొచ్చినా..
చెదరని నవ్వుల ఇంద్ర-ధనస్సులం..

మేమే ఇండియన్స్..మేమే ఇండియన్స్..
మేమే ఇండియన్స్..అరే..మేమే ఇండియన్స్..

మేమే ఇండియన్స్..మేమే ఇండియన్స్..
మేమే ఇండియన్స్…మేమే ఇండియన్స్..

వంద నోటు జేబులో ఉంటే నవాబు నైజం..
పర్సు ఖాలి అయ్యిందంటే ఫకీరు తత్వం..
కళ్లు లేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం..
పడుచు పోరి ఎదురుగా వస్తే పల్లిఇకిలిస్తాం..
ప్రేమ కావాలంటాం.. పైసా కావాలంటాం..
ఎవో కలలే కంటాం.. తిక్క తిక్క గా ఉంటాం..

ఏడేళ్లయినా T.V. సీరియల్ ఏడుస్తూనే చూస్తాం..
తోచకపోతే సినిమాకెల్లి రికార్డ్ డాన్సులు చేస్తాం..
కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడికి ఓటుస్తాం..
అందరు దొంగల్లో అసలు దొంగకే సీటు అప్పచెప్పేస్తాం..
రూలు ఉంది హ హ రాంగు ఉంది హే హే
రూలు ఉంది రాంగు ఉంది..
తప్పుకు తిరిగే లోక్యం ఉంది..

మేమే ఇండియన్స్..మేమే ఇండియన్స్..
మేమే ఇండియన్స్..అరే..మేమే ఇండియన్స్..

వందేమాతరం..వందేమాతరం..
వందేమాతరం..వందేమాతరం..

వందేమాతరం..వందేమాతరం..
వందేమాతరం..వందేమాతరం..

వందే……మాతరం..
వందే……మాతరం..
వందే……మాతరం..
వందే……మాతరం..

కలలు కన్నీలెన్నో మనకళ్ళల్లో..
ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో..
శత్రువుకే ఎదురు నిలిచినా రక్తం మనదీ..
ద్వేషాన్నే ప్రేమగా మార్చిన దేశం మనదీ..
ఈశ్వర్ అల్లా ఏసు..ఒకడే కదరా బాసు..
దేవుడికెందుకు జెండా.. కావాల పార్టీ అండా..
మాతృభూమిలో మంటలు రేపే మాయదారి కనికట్టు..
అన్నదమ్ములకు చిచ్చు పెట్టిన లుచ్చాగాళ్లా పనిపట్టు..
భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తు జై కొట్టు..
కుట్రలు చేసే శత్రు మూకల తోలు తీసి ఆరబెట్టు..
దమ్మే ఉంది..హ హ.. ధైర్యం ఉంది..హ హ..
దమ్మే ఉంది.. ధైర్యం ఉంది..
తల వంచని తల పొగరే ఉంది..

మేమే ఇండియన్స్..మేమే ఇండియన్స్..
మేమే ఇండియన్స్..అరే..మేమే ఇండియన్స్..

మేమే ఇండియన్స్..మేమే ఇండియన్స్..
మేమే ఇండియన్స్..మేమే ఇండియన్స్..


చిత్రం: ఖడ్గం (Kadgam)
పాట పేరు: మేమే ఇండియన్స్ (Meme Indians)
తారాగణం: రవితేజ (Ravi Teja), శ్రీకాంత్ (Srikanth), సోనాలి బింద్రే (Sonali Bindhre) తదితరులు
గాయకులు: హనీ (Honey)
సాహిత్యం: శక్తి (shakti)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
చిత్ర దర్శకత్వం: కృష్ణ వంశీ (Krishna Vamsi)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.