Home » మధువరమే (Madhuvaramae) సాంగ్ లిరిక్స్ Return of The Dragon

మధువరమే (Madhuvaramae) సాంగ్ లిరిక్స్ Return of The Dragon

by Lakshmi Guradasi
0 comments
Madhuvaramae song lyrics Return of The Dragon

ఖాళీ కన్ను తెరిచానే
కలగా నిన్ను కలిసానే
మధువరమే మధువరమే వరమే

నేడే తెలిసే నా నువ్వెవరో
నాలో మెరిసే చిరునవ్వెవరో

నేడే తెలిసే నా నువ్వెవరో
నాలో మెరిసే చిరునవ్వెవరో

నిన్నే చూసి పులకింతా
ఉయ్యాలూగే జగమంతా
గొంతే దిగని దిగులంతా
ఇట్టే చెరిగేనే ..

రా చెయ్యి పట్టి నిను నడిపిస్తా
భూ గ్రహపు అంచులలో విహరిస్తా
గగనలందుకుని ఆ చోటే తొలి ముద్దే నీకందిస్తా

నా సగము ఊపిరి పోగేస్తా
ఆధరాల వాలుగా పంపిస్తా
నీ గుండే నీడనై జీవిస్తా
కడదాకా నీతో వస్తా

ఖాళీ కన్ను తెరిచానే
కలగా నిన్ను కలిసానే
మధువరమే మధువరమే వరమే

మండే ఇసుక తిన్నెలలో
ముంచాయి చలువ కురిసావే
మధువరమే మధువరమే వరమే

నేడే తెలిసే నా నువ్వెవరో
నాలో మెరిసే చిరునవ్వెవరో

నల్లనైన నా కనుపాప సమ్మోహనమయ్యేలా
తెల్లనైన ఆశలు చూపింది నీ ప్రేమేలే

వాన కురిసి వెలిసిన తీరు ఇన్నాళ్ల గతమంతా
జిగెల్లంటూ మెరిసే నీవల్లే..

చిరుగాలికి రివ్వున ఎగిరే
పుపొడిలా నీపై వాలా
ఈ హృదయము నీదేనంటూ
వెతికి వెతికి జంటగా అవ్వగా

జత మనసు ఒక్కటుందని అంటూ
ఏడ లాగిన నో అనుకుంటూ
ఇన్నాళ్లకు నిను కనుకొన్న నమ్మకమే నిజముగా

ఖాళీ కన్ను తెరిచానే
కలగా నిన్ను కలిసానే
మధువరమే మధువరమే వరమే

మండే ఇసుక తిన్నెలలో
ముంచాయి చలువ కురిసావే
మధువరమే మధువరమే వరమే

_________________________

సాంగ్: మధువరమే (Madhuvaramae)
చిత్రం: రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return of The Dragon)
సాంగ్ రూపొందించిన వారు : అశ్వత్ మరిముత్తు (Ashwath Marimuthu)
సంగీతం: లియోన్ జేమ్స్ (Leon James)
లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
గాయకులు: శరత్ సంతోష్ (Sarath Santhosh), శ్రీనిషా జయశీలన్ (Srinisha Jayaseelan)
నటీనటులు : ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan), కయదు లోహర్ (Kayadu Lohar )
రచన & దర్శకత్వం: అశ్వత్ మరిముత్తు (Ashwath Marimuthu)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.