Home » కోరేదెలా శివుని చేరేదెలా (koredela shivuni cheredela) లిరిక్స్

కోరేదెలా శివుని చేరేదెలా (koredela shivuni cheredela) లిరిక్స్

by Lakshmi Guradasi
5.8K views
koredela shivuni cheredela song lyrics

కోరేదెలా శివుని చేరేదెలా?
దరికి దారేదని హరుని సెలవీమని..
నీదే కదా తనువు నీవే కదా అణువు
నాదేది నీ దరికి నను చేరనీ..

నా శ్వాస నీకు నా నీరాజనము గను
నా స్వరము నీకు నా అభిషేకము గను
ఈ తనువు నీకు నా నైవేద్యము గను
నా కర్మలే నీకు పరిచర్యల గను

అక్షరంబులు నీకు అక్షతలు గాను
పదమాలలను నీకు పూమాలిక గను
కరతాళ ధ్వనులివే మేళతాళాల గను
సేవించనా నిన్ను నీ భక్తుని గను

కోరేదెలా శివుని చేరేదెలా?
దరికి దారేదని హరుని సెలవీమని..
నీదే కదా తనువు నీవే కదా అణువు
నాదేది నీ దరికి నను చేరనీ..

ఏమి వరమయ్యా నిన్ను స్తుతియించగా
నాకు వరముగానిది ఏది నీ జగములోను
నీకు సాటెవ్వడయ్యా వరము లిచ్చుటలోను
శరణు గోరినవాని రక్ష చేయుటలోను

గరళమ్మునే మ్రింగి గళమున్ దాచేవు
అసురేషుడైన కరి ఉదరమున నిలిచేవు
భక్తసులభుడవయ్యా ముక్తిధాతవు నీవు
శ్రీకాల హస్తీశుడవై వెలసినావు

కోరేదెలా శివుని చేరేదెలా?
దరికి దారేదని హరుని సెలవీమని..
నీదే కదా తనువు నీవే కదా అణువు
నాదేది నీ దరికి నను చేరనీ..

కోరేదెలా శివుని చేరేదెలా?
దరికి దారేదని హరుని సెలవీమని..

In English Version:

Koredela Shivuni Cheredela?
Dariki Daaredani Haruni Selaveemani..
Neede Kada Tanuvu Neeve Kada Anuvu
Naadedi Nee Dariki Nanu Cherani..

Naa Shwaasa Neeku Naa Neeraajanamu Ganu
Naa Swaramu Neeku Naa Abhishekamu Ganu
Ee Tanuvu Neeku Naa Naivedyamu Ganu
Naa Karmale Neeku Paricharyala Ganu

Aksharambulu Neeku Akshatalu Gaanu
Padamaalalanu Neeku Poomaalika Ganu
Karataala Dhwanulive Melataalaala Ganu
Sevinchanaa Ninnu Nee Bhaktuni Ganu

Koredela Shivuni Cheredela?
Dariki Daaredani Haruni Selaveemani..
Neede Kada Tanuvu Neeve Kada Anuvu
Naadedi Nee Dariki Nanu Cherani..

Emi Varamayya Ninnu Stutiyinchagaa
Naaku Varamugaanidi Edi Nee Jagamulonu
Neeku Saatevvadayya Varamu Lichchutalonu
Sharanu Gorinavaani Raksha Cheyutalonu

Garalammune Mringi Galamun Daachevu
Asureshudaina Kari Udaramuna Nilichevu
Bhakta Sulabhudavayya Mukti Dhaatavu Neevu
Sri Kaalahastishudavai Velasinaavu

Koredela Shivuni Cheredela?
Dariki Daaredani Haruni Selaveemani..
Neede Kada Tanuvu Neeve Kada Anuvu
Naadedi Nee Dariki Nanu Cherani..

Koredela Shivuni Cheredela?
Dariki Daaredani Haruni Selaveemani..

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.