Home » కొండగట్టు లో వెలసిన అంజన్నా లిరిక్స్ / Kondagattulo Velasina Anjanna Lyrics

కొండగట్టు లో వెలసిన అంజన్నా లిరిక్స్ / Kondagattulo Velasina Anjanna Lyrics

by Lakshmi Guradasi
0 comments
Kondagattulo velasina anjanna lyrics

కొండగట్టు లో వెలసిన అంజన్నా …..
నీ అండా దండా మాకుండాలని,
కొబ్బరికాయలు పూలూ పండ్లు పలహారాలు నీకు తెస్థిమయ్య

!!కొండగట్టులో వెలసిన అంజన్న!!

తడి బట్టలతో స్నానం చేసి, వడివడిగా నీ గుడిలో కొచ్చి
రామ మంత్రమే పటియించేము, రామ దూతయని పూజించెము
కళకళలాడే ఓ అంజన్నా, కరుణతో మమ్ము కాపాడ రావయ్య

!!కొండగట్టులో వెలసిన అంజన్న!!

నీ ముందేమో కోటి కోతులు, నీ చుట్టేమో కోటి భక్తులు
జిగేలుమన్నా జిల్లెడు దండలు, పవిత్రమైన పత్తిరాకులు
గణగణమని నీ గుడి గంటలు కొట్టీ ఘనముగ పూజలు చేసేము అంజన్నా

!!కొండగట్టులో వెలసిన అంజన్న!!

మెండైన నీ కొండను ఎక్కి, దండిగా పూజలు చేసేమయ్య
నిన్ను తలవనీ కాయమెందుకూ నిన్ను కొలవనీ కరములేందుకు
బహుబలవంత బ్రహ్మస్వరూప, బాధలు బాపగా వేగమే రావయ్యా

!!కొండగట్టులో వెలసిన అంజన్న!!

కొండగట్టుపై వెలసితివయ్య దండి రాక్షసులగుల్చితివయ్య
ని గుడియందు గండ దీపము ని గుడి ముందు గరుడ స్తంభము
వేగా వేగా ని కొండకు వచ్చి వేడుకలెన్నో చేసేము అంజన్న

!!కొండగట్టులో వెలసిన అంజన్న!!

In English Version:

Kondagattu lo velasina Anjanna…
Nee anda danda maakundaalani,
Kobbarikayalu poolu pandlu palahaaralu neeku testhimayya

!!Kondagattulo velasina Anjanna!!

Tadi battalato snaanam chesi, vadivadiga nee gudilo kochchi
Raama mantrame patiyinchemu, Raama dootayani poojinchemu
Kalakalalaade o Anjanna, karunato mammu kaapaada raavayya

!!Kondagattulo velasina Anjanna!!

Nee mundemo koti kothulu, nee chuttemo koti bhaktulu
Jigelumanna jilleda dandalu, pavitramaina pattiraakulu
Ganaganamani nee gudi gantalu kotti ghanamuga poojalu chesemu Anjanna

!!Kondagattulo velasina Anjanna!!

Mendaina nee kondanu ekki, dandiga poojalu chesemayya
Ninnu talavani kaayemenduku, ninnu kolavani karamulu enduku
Bahubalavantha brahma swaroopa, baadhalu baapaga vegame raavayya

!!Kondagattulo velasina Anjanna!!

Kondagattupai velasitivayya dandi raakshasulagulchitivayya
Nee gudiyandu ganda deepamu, nee gudi mundu garuda stambhamu
Vega vega nee kondaku vacchi vedukalenno chesemu Anjanna

!!Kondagattulo velasina Anjanna!!

See Also plz click on this: 

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.