bangaru thallivamma durgamma lyrics

బంగారు తల్లివమ్మా దుర్గమ్మ (Bangaru thallivamma durgamma) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

హ బంగారు తల్లివమ్మా దుర్గమ్మ – మా బాధలన్నీ తీర్చవమ్మా దుర్గమ్మ
బంగారు తల్లివమ్మా దుర్గమ్మ – మా బాధలన్నీ తీర్చవమ్మా దుర్గమ్మ
మా సింగారు తల్లివమ్మా దుర్గమ్మ – మా సిక్కులన్నీ బాపవమ్మా దుర్గమ్మ
సింగారు తల్లివమ్మా దుర్గమ్మ – మా సిక్కులన్నీ బాపవమ్మా దుర్గమ్మ
తల్లి దుర్గమ్మ…

1. రోగాలు నొప్పులొచ్చి రోజులు గడవబట్టే
తిందామంటే తిండి కట్టు బట్టలు లేక
దరిద్రమే మాకు దయ్యమై పట్టిందమ్మా
నీ దయ కరువయ్యి బతుకే బరువయిందమ్మా
నీ దయ కరువయ్యి బతుకే బరువయిందమ్మా

రోగాలు నొప్పులొచ్చి రోజులు గడవబట్టే
తిందామంటే తిండి కట్టు బట్టలు లేక
దరిద్రమే మాకు దయ్యమై పట్టిందమ్మా
నీ దయ కరువయ్యి బతుకే బరువయిందమ్మా
నీ దయ కరువయ్యి బతుకే బరువయిందమ్మా

తల్లి.. మా ఇల్లు వాకిలంతా చూడు దుర్గమ్మ
వల్లకాడుగా మారేనమ్మా దుర్గమ్మ
ఇల్లు వాకిలంతా చూడు దుర్గమ్మ
వల్లకాడుగా మారేనమ్మా దుర్గమ్మ

బంగారు తల్లివమ్మా దుర్గమ్మ – మా బాధలన్నీ తీర్చవమ్మా దుర్గమ్మ
బంగారు తల్లివమ్మా దుర్గమ్మ – మా బాధలన్నీ తీర్చవమ్మా దుర్గమ్మ

2. పోయిన యేడు మొక్కుకున్నా మొక్కులు తీర్చలేక
కోరి మొక్కిన గాని కొండకు రాలేదని
కోపాలు చూపించి శాపాలు పెట్టినావో
అష్ట కష్టాలతో వరిగోసపడుతున్నామే
అష్ట కష్టాలతో వరిగోసపడుతున్నామే

పోయిన యేడు మొక్కుకున్నా మొక్కులు తీర్చలేక
కోరి మొక్కిన గాని కొండకు రాలేదని
కోపాలు చూపించి శాపాలు పెట్టినావో
అష్ట కష్టాలతో వరిగోసపడుతున్నామే
అష్ట కష్టాలతో వరిగోసపడుతున్నామే

తల్లి దుర్గమ్మ…ఈసారి తప్పకుండా దుర్గమ్మ
నిన్ను చెర వచ్చి కొలిచేమమ్మా దుర్గమ్మ
ఈసారి తప్పకుండా దుర్గమ్మ
నిన్ను చెర వచ్చి కొలిచేమమ్మా దుర్గమ్మ

బంగారు తల్లివమ్మా దుర్గమ్మ – మా బాధలన్నీ తీర్చవమ్మా దుర్గమ్మ
బంగారు తల్లివమ్మా దుర్గమ్మ – మా బాధలన్నీ తీర్చవమ్మా దుర్గమ్మ

3. అన్ని నువ్వే అలకలు మానాలమ్మ
అదిశక్తివి నీవే అంబ భవాని నీవే
బాధలు అన్ని బాపి మమ్మ ఆదరించాలమ్మా
కష్టాలు అన్ని తీర్చి కనికరించాలమ్మా
కష్టాలు అన్ని తీర్చి కనికరించాలమ్మా

అన్ని నువ్వే అలకలు మానాలమ్మ
అదిశక్తివి నీవే అంబ భవాని నీవే
బాధలు అన్ని బాపి మమ్మ ఆదరించాలమ్మా
కష్టాలు అన్ని తీర్చి కనికరించాలమ్మా
కష్టాలు అన్ని తీర్చి కనికరించాలమ్మా

తల్లి…మా తప్పులన్నీ మన్నించే దుర్గమ్మ
మేము తప్పకుండ వస్తామమ్మా దుర్గమ్మ
తప్పులన్నీ మన్నించే దుర్గమ్మ
మేము తప్పకుండ వస్తామమ్మా దుర్గమ్మ

బంగారు తల్లివమ్మా దుర్గమ్మ – మా బాధలన్నీ తీర్చవమ్మా దుర్గమ్మ
బంగారు తల్లివమ్మా దుర్గమ్మ – మా బాధలన్నీ తీర్చవమ్మా దుర్గమ్మ

4. నలుదిక్కులు నీకు నవరాత్రుల పాటు
వాడవాడల్లో చూడు వేడుకలే జెయ్య
పిల్ల పాపలతో కలిసి నిన్ను దర్శించంగా
రోగాలు బాధలన్నీ మాయమైపోతున్నాయే
రోగాలు బాధలన్నీ మాయమైపోతున్నాయే

నలుదిక్కులు నీకు నవరాత్రుల పాటు
వాడవాడల్లో చూడు వేడుకలే జెయ్య
పిల్ల పాపలతో కలిసి నిన్ను దర్శించంగా
రోగాలు బాధలన్నీ మాయమైపోతున్నాయే
రోగాలు బాధలన్నీ మాయమైపోతున్నాయే

దుర్గమ్మ.. విజయదశమి పండుగకు దుర్గమ్మ
నీ విజయవాడకు వస్తామమ్మ దుర్గమ్మ
విజయదశమి పండుగకు దుర్గమ్మ
నీ విజయవాడకు వస్తామమ్మ దుర్గమ్మ

బంగారు తల్లివమ్మా దుర్గమ్మ – మా బాధలన్నీ తీర్చవమ్మా దుర్గమ్మ
బంగారు తల్లివమ్మా దుర్గమ్మ – మా బాధలన్నీ తీర్చవమ్మా దుర్గమ్మ
మా సింగారు తల్లివమ్మా దుర్గమ్మ – మా సిక్కులన్నీ బాపవమ్మా దుర్గమ్మ
సింగారు తల్లివమ్మా దుర్గమ్మ – మా సిక్కులన్నీ బాపవమ్మా దుర్గమ్మ
మా బాధలన్నీ తీర్చవమ్మా దుర్గమ్మ
మా బాధలన్నీ తీర్చవమ్మా దుర్గమ్మ

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like