Home » కంద పచ్చడి – తయారీ విధానం

కంద పచ్చడి – తయారీ విధానం

by Haseena SK
0 comment

కావలసినవి పదార్థాలు :

  1. కంద – ఒకటి
  2. పసుపు – అర టిస్పూన్
  3. ఉప్పు – తగినంత
  4. నూనె – ఆరు స్పూన్లు
  5. ఆవాలు – 1 టిస్పూన్
  6. మినపప్పు – 1 టిస్పూన్
  7. పచ్చి శనగపప్పు – 1 టిస్పూన్
  8. ఎండుమిర్చి – 5
  9. కొత్తిమీర – తురుము
  10. చింతపండు – 50 గ్రా
  11. ఇంగువ – చిటికెడు

తయారీ విధానం:

మందుగా ఒక కంద తీసుకుని దాన్నిచిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో తీసుకుని వాటిని బాగా కడిగి పక్కన పెటుకువాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దాని లో నూనె పోసి బాగా వేడి చేయాలి. ఇప్పుడు కడిగి పక్కన పెట్టిన కంద వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేగించుకోవాలి. దాన్ని ఒక గిన్నె లోకి తీసుకుని బాగా చలారనివాళి. ఇప్పుడు మిక్సీ జార్ లోకి కంద, ఎండుమిర్చి, చింతపండు ఉప్పు తగినంత వేసి కచ్చాపచ్చాగా తిప్పుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసికొన్ని మరో గిన్నె తీసుకుని దాన్నిలో కొంచం నూనె పోసి బాగా వేడి చేసుకోవాలి దాన్నిలో ఆవాలు, మినపప్పు, పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి, పసుపు, కొత్తిమీర, ఇంగువ చిటికెడు వేసి బాగా వేగనియాలి ముందుగా కచ్చాపచ్చాగా తిప్పిన కందను వేసి బాగా తిప్పుకోవాలి. అంతే కంద పచ్చడి రెడీ.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment