ఇండియన్ బ్యాంక్ ఇటీవల 10 రూపాయల కాయిన్‌పై ఒక కీలక ప్రకటన చేసింది. 10 రూపాయల కాయిన్‌లు చెలామణి లో లేవని, వాటిని వ్యాపారాలు, ప్రజలు అంగీకరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో, ఇండియన్ బ్యాంక్ స్పష్టంగా వెల్లడించింది. 10 రూపాయల కాయిన్ పూర్తి చెలామణి లో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఈ కాయిన్‌లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) దృష్టిలో చట్టబద్ధమైనవి మరియు దేశ వ్యాప్తంగా అన్ని లావాదేవీల్లో ఉపయోగించవచ్చు. కాబట్టి, కాయిన్లను తిరస్కరించడం చట్టరీత్యా తగదు అని బ్యాంక్ అధికారులు తెలిపారు. అలాగే, 10 రూపాయల కాయిన్‌లు నకిలీ అని భావించి తీసుకోకపోవడం పూర్తిగా తప్పు అని RBI స్పష్టం చేసింది.
ఇలాంటి అపోహలు వల్ల కాయిన్లు తీసుకోవడానికి కొందరు వాణిజ్య సంస్థలు మరియు వ్యక్తులు వెనుకడుగు వేస్తున్నారు. అందువల్ల, ప్రజలకు మరియు వ్యాపారులకు బ్యాంక్ పిలుపునిచ్చింది ఆత్మవిశ్వాసంతో 10 రూపాయల కాయిన్‌లు స్వీకరించాలని. ఇది ప్రజల్లో విశ్వాసం పెంపొందించడానికి, చెలామణిలో ఉన్న అన్ని కాయిన్‌లు చట్టబద్ధమైనవని తెలియజేయడానికి చేసిన ఒక కీలక చర్య.
ఇటువంటి మరిన్ని విషయాల కొరకుతెలుగు రీడర్స్ వార్తలును చూడండి.