సొర నవ్వుల పిల్లగాడు
ఇరా పువ్వుల వన్నెగాడు
సొర నవ్వుల పిల్లగాడు
ఇరా పువ్వుల వన్నెగాడు
నన్ను కుసోబెట్టి ముచ్చటబెట్టి
మాయలు చేసాడో….
ముద్దబంతి మోము ఉన్నోడ
ఉరకంటా చూసేవాడ
ముద్దబంతి మోము ఉన్నోడ
ఉరకంటా చూసేవాడ
కంటి సూపు తోనే గాలం వేసి
లాగేసుకున్నాడో..
వాని జండా పాతి పోయినాడు
గుండెలో ఇట్లా..
ఏ మందో పెట్టి మలుపుకున్నాడు
ఆగేది ఎట్లా..
గుగ్గుమ్మ గుగ్గుమ్మ గుమ్మరే
నా మనసు లాగేసుకున్నడే
గుగ్గుమ్మ గుగ్గుమ్మ గుమ్మరే
వాడు తేనెలు పూసిన మాటగాడే
గుగ్గుమ్మ గుగ్గుమ్మ గుమ్మరే
నా మనసు లాగేసుకున్నడే
గుగ్గుమ్మ గుగ్గుమ్మ గుమ్మరే
అరె వాడు తేనెలు పూసిన మాటగాడే
జాలి లేని పిల్లగాడు
జాగ్రత్తగా దచ్చేవాడు
జాలి లేని పిల్లగాడు
జాగ్రత్తగా దచ్చేవాడు
వాని గుప్పెడు గుండెల్లో
బొచ్చెడు జాగిని రాసి ఇచ్చినాడే
ముక్కు మీదనే కోపం ఉన్నోడు
ముద్దు ముద్దుగా చూసేటోడు
ముక్కు మీదనే కోపం ఉన్నోడు
ముద్దు ముద్దుగా చూసేటోడు
మస్తు మస్తుగా మాఊరి వాడాలో
పేరు మోసినోడే…
రంగు రంగుల లంగావోణీ
కొనిపెట్టినాడే
రంది లేని జీవితాన్ని
నాకే రాసి ఇస్తా అన్నాడే
ఆ.. గుగ్గుమ్మ గుగ్గుమ్మ గుమ్మరే
వాని పెళ్లాన్ని నేనే అన్నాడే
గుగ్గుమ్మ గుగ్గుమ్మ గుమ్మరే
కళ్ళకు కలలు పెంచాడే
గుగ్గుమ్మ గుగ్గుమ్మ గుమ్మరే
వాని పెళ్లాన్ని నేనే అన్నాడే
గుగ్గుమ్మ గుగ్గుమ్మ గుమ్మరే
కళ్ళకు కలలు పెంచాడే
నాడు చప్పుడు మర్చి ఆడు
వాడి డప్పులు మోగించ్చినాడు
నాడు చప్పుడు మర్చి ఆడు
వాడి డప్పులు మోగించ్చినాడు
అరె ఐదు అడుగుల ఆరు అంగుళాల
అందగాడు వాడు
గాడి ఎక్కించి కూర్చోబెట్టాడు
వాడ వాడల్లా తిప్పినా వాడు
గాడి ఎక్కించి కూర్చోబెట్టాడు
వాడ వాడల్లా తిప్పినా వాడు
గాలిలోనే ప్రేమ లేఖలు వాడు
రాసి పంపినాడే ..
జారిపోయి జాతకం అందించ్చినాను
జత కూడా మంటూ
వాలిపోయినాను వాని ఎద మీద ఒట్టు
గుగ్గుమ్మ గుగ్గుమ్మ గుమ్మరే
పంచ పట్టి కొలువు తీరడే
గుగ్గుమ్మ గుగ్గుమ్మ గుమ్మరే
చందమామకు వాడేం తీసిపాడే
గుగ్గుమ్మ గుగ్గుమ్మ గుమ్మరే
పంచ పట్టి కొలువు తీరడే
గుగ్గుమ్మ గుగ్గుమ్మ గుమ్మరే
చందమామకు వాడేం తీసిపాడే
చీటి మాటికీ మూతిని ముడిచి
చిన్నమాటకి చిన్నబోతే
చీటి మాటికీ మూతిని ముడిచి
చిన్నమాటకి చిన్నబోతే
నేను ఆలిగివుంటే బతిమిలాడి
దేవులాడుతాడే…
ముక్కు మీదనే కోపం జూపి
సర్రు బుర్రులాట ఆడి
ముక్కు మీదనే కోపం జూపి
సర్రు బుర్రులాట ఆడి
వాడు చల్లని మంచోలే కరిగిపోయ్యే
గుణమున్నవాడే..
ఎందుకో ఏమో మాటలు
పరచి ఏడిపిస్తావున్నాడు
చిన్న నవ్వైనా చాలు
గుండెలో వాడ్ని దాచుకుంటా నేను
గుగ్గుమ్మ గుగ్గుమ్మ గుమ్మరే
నా మనసు లాగేసుకున్నడే
గుగ్గుమ్మ గుగ్గుమ్మ గుమ్మరే
వాడు తేనెలు పూసిన మాటగాడే
గుగ్గుమ్మ గుగ్గుమ్మ గుమ్మరే
నా మనసు లాగేసుకున్నడే
గుగ్గుమ్మ గుగ్గుమ్మ గుమ్మరే
వాడు తేనెలు పూసిన మాటగాడే
____________________________
పాట: గుగ్గుమ్మ గుగ్గుమ్మ గుమ్మరే (Guggumma Guggumma Gummare)
సాహిత్యం: మానుకోట ప్రసాద్ (Manukota Prasad)
గాయకుడు: శ్రీనిధి (Srinidhi)
సంగీతం: కళ్యాణ్ కీస్ (Kalyan Keys)
తారాగణం: జానులిరి (Janulyri)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.