ఓ ముస్తాబై మురిపంగా కదిలినవే బొమ్మ
కన్నీరే జరంగా
నువ్ నీ మనసే మోసేనే తరగని బాధమ్మ
తెలిసేలే ఎదగాధ
నువ్వు కోరిన నీ జత ఇక లేదే
బతిమాలిన బరువే ఇక రాదే
నా సెయ్యి పట్టినప్పుడు
గురుతులేదనే అవ్వాయ్య ప్రేమ
నా ఏంటా తిరిగినప్పుడు
రాలేదే కులము వేరు అన్న మాట
దొరసానీవనుకున్నానే పిల్ల
పాలొడిలా నన్ను తొక్కేస్తివి
దొరనైతే నేను గాదె
పిల్ల నీ మీద ప్రేమున్నా పిచ్చోడిని
పెళ్లి చేసుకొని పోతున్నావానే
ఇంకోలి ఇంటికి
నిన్ను కలవలేక ప్రాణం ఆగిపోతుందేమో
కనిపించవే కంటికి
ఓ చిన్నదాన నీ సెయ్యి పట్టిననాడే
సీదరించుకుంటే తప్పుకుందే
ఓ కుర్రదాన మనసులో నన్నే దాచి
ఇప్పుడు ఇడిసిపోతానంటే ఒప్పుకొనే
ఓ చిన్నదాన నీ సెయ్యి పట్టిననాడే
సీదరించుకుంటే తప్పుకుందే
ఓ కుర్రదాన మనసులో నన్నే దాచి
ఇప్పుడు ఇడిసిపోతానంటే ఒప్పుకొనే
నన్ను ఇడిసిపోతానంటే ఒప్పుకొనే
నా సెయ్యి పట్టినప్పుడు
గురుతులేదనే అవ్వాయ్య ప్రేమ
నా ఏంటా తిరిగినప్పుడు
రాలేదే కులము వేరు అన్న మాట
వెరోని సెయ్యి పట్టినప్పుడు
గురుతురాలేదయ్యె నా ప్రేమ
నీ మెళ్ళో పూస్తే కట్టినప్పుడే
పోయిందే నా లోపలి అయ్యువు ఇలా
కన్నీళ్లే తోడయానే పిల్ల
నన్నే ఇడిసి నువ్వు పోతువుంటే
కణికరమంటూ లేదే నీకె
కాటిలోనే నన్ను కలిపి పోకే
నన్నే ఇడిసి నువ్వు పోతున్నావానే
ఇంకోలికి ఆలివై
మనసిచ్చినాడే సేదయ్యనమ్మో
మళ్ళి రాకే తోడుకై
నా కంటిలో కన్నీరే జారుతానే నువ్వు
ఓర్చుకోనంటివి ఏమాయనే
మరి ఆ కంట నీరునే తెప్పించేలా నీకు
అంతలా ఏ తోడు ఎదురాయెనే
నా కంటిలో కన్నీరే జారుతానే నువ్వు
ఓర్చుకోనంటివి ఏమాయనే
మరి ఆ కంట నీరునే తెప్పించేలా నీకు
అంతలా ఏ తోడు ఎదురాయెనే
నీకు అంతలా ఏ తోడు ఎదురాయెనే
నా సెయ్యి పట్టినప్పుడు
గురుతులేదనే అవ్వాయ్య ప్రేమ
నా ఏంటా తిరిగినప్పుడు
రాలేదే కులము వేరు అన్న మాట
నీ ప్రేమలోనే నిండుగా
నే తేలిపోతినే నువ్వొచ్చినాక
నా గుండెలోనే దాచిన
అందుకే గండమోలే చూసినవా
దయగాళ్ల మారాణివే పిల్ల
అద్దాల మెడలే నిక్కున్నాయే
పూరి గుడిసున్న పెదోడినే
నేనే ఆశ పడితి నీపై తప్పు నాదే
అందానిదానికి అంతురాలే కడితి
ఊహలల్ల మెడలే
అందుకున్నమ్మన్న అందాని జాబిలివే
చుక్కనై మిగిలితే
ఓ మట్టిలో కలిసేనే ఈ బంధమే నాకు
మరణమొచ్చిన నిన్ను ఇడిసిపోదే
ఓ మరుపంటూ తేలిక నీ మనసుకే
కానీ గాయమంటూ తగిలే నా గుండెకే
ఓ మట్టిలో కలిసేనే ఈ బంధమే నాకు
మరణమొచ్చిన నిన్ను ఇడిసిపోదే
ఓ మరుపంటూ తేలిక నీ మనసుకే
కానీ గాయమంటూ తగిలే నా గుండెకే
గాయమంటూ తగిలే నా గుండెకే
నా సెయ్యి పట్టినప్పుడు
గురుతులేదనే అవ్వాయ్య ప్రేమ
నా ఏంటా తిరిగినప్పుడు
రాలేదే కులము వేరు అన్న మాట
_______________________________
పాట: నా సెయ్యి పట్టినప్పుడు (Na Seyyi Patinappudu)
కాన్సెప్ట్ & డైరెక్టర్: నవీన్ కుమార్ ఎం (Naveen Kumar M)
నిర్మాత: వాసు పటేల్ – విక్కీ గంజి (Vikky Ganji)
సంగీతం: హనీ గణేష్ (Honey Ganesh)
గాయకుడు: హనుమాన్ యాదవ్ (Hanmanth Yadav)
సాహిత్యం: దివ్య భోనగిరి (Divya Bhonagiri)
తారాగణం: పవన్ కళ్యాణ్ (Pavan Kalyan), సిరి రావుల (Siri Ravula), సాయి కిరణ్ (Sai Kiran), డిజైనర్ బన్నీ (Designer Bunny)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.