తెలిసిందా నేడు గమనించి చూడు
నిన్ను కన్న తోడు విలువెంటనీ
నిషీ నీడలోను నిన్ను వీడిపోనీ
ఒక నాన్న మనస్సు బరువెంతనీ
పొరపాటునా….. చేజారకు…
పొరపాటునా చేజారకు
మరి దొరకని ఆ ఉనికిని
వేదించకు బాధించకు
నిన్ను పెంచిన ఆ ప్రేమని
తెలిసిందా నేడు గమనించి చూడు
నిన్ను కన్న తోడు విలువెంటనీ
విలువెంటనీ..
ఏది నీ నిధి ఏది కానిది తేల్చుకోలేవా
పెడదారిగా విధి నడుపుతున్నది పోల్చుకోలేవా
ఏది నిజమగు రాబడి
ఏమిటో నీ అలజడి
చిటికెలో సుడి తిరిగిన
చేడు తలపులే నిన్ను తరిమిన
మరు క్షణములో పాల కలిగిన
పరితాపమే ఎద నలుపు కడిగిన
మార్పుగా…తొలి తూర్పుగా
ఆ నిన్నటి నీ చీకటి వదిలి పాద
తెలిసిందా నేడు గమనించి చూడు
నిన్ను కన్న తోడు విలువెంటనీ
పొరపాటునా….. చేజారకు…
పొరపాటునా చేజారకు
మరి దొరకని ఆ ఉనికిని
వేదించకు బాధించకు
నిన్ను పెంచిన ఆ ప్రేమని
తెలిసిందా నేడు గమనించి చూడు
నిన్ను కన్న తోడు విలువెంటనీ
విలువెంటనీ.. విలువెంటనీ
__________________________________
సినిమా పేరు: రామం రాఘవం (Ramam Raghavam)
పాట పేరు: తెలిసిందా నేడు (Telisinda Nedu)
గాయకుడు: శ్రీకాంత్ హరిహరన్ (Sreekanth Hariharan)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
సంగీతం: అరుణ్ చిలువేరు (Arun Chiluveru)
తారాగణం: సముద్రఖని (Samuthirakani), ధనరాజ్ కోరనాని (Dhanraj Koranani), మరియు ఇతరులు
దర్శకుడు: ధనరాజ్ కోరనాని (Dhanraj Koranani)
కథ: శివప్రసాద్ యానాల (Sivaprasad Yanala)
నిర్మాత: పృధ్వీ పోలవరపు (Prudhvi Polavarapu)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.