బొమ్మలు గీస రంగులు వేసా
రూపము నీదెలే
బొమ్మలు గీస రంగులు వేసా
రూపము నీదెలే
తారలు కోసదరగ పోసా
అవి నీ నవ్వులులే
కాంతి కన్న వేగమంటే నీకై తీసె నా పరుగులే
నా ప్రపంచమేదంటే నీ నీడలో దాగెనే
నా ప్రయాణమెటు అంటే నీ అడుగులా చాటునే
నా ప్రపంచమేదంటే నీ నీడలో దాగెనే
నా ప్రయాణమెటు అంటే నీ అడుగులా చాటునే
నిద్దుర మాని నీకై వేచా
నీతో నడిచే వేళలు కొలిచా
అయినా కాని చూడదు నన్నే
చెలి నీ కన్నె ఎం చేయనే
ప్రేమ కన్న ప్రేమ ఉంటే దాని పేరే నేను అంతే
హృదయం ప్రతి నిమిషం నీ సవ్వడి ఆపదే
నీ కబురు వినే నిముషం వస్తుందని ఆశలే
నా ప్రమచమయ్యవే ఓ తియ్యని నవ్వుతో
ఎంత ప్రేమించిన నువ్వే వరించావు చూపుతో
హృదయం ప్రతి నిమిషం నీ సవ్వడి ఆపదే
నీ కబురు వినే నిముషం వస్తుందని ఆశలే
నా ప్రమచమయ్యవే ఓ తియ్యని నవ్వుతో
ఎంత ప్రేమించిన నువ్వే వరించావు చూపుతో
___________________________________
పాట: సంచారి (Sanchari)
నటీనటులు: జానీ మాస్టర్ (Jani Master), శ్రాస్తి వర్మ ( Shrasti Verm)
గాయకుడు: సాగర్ (Sagar)
సంగీతం: అంకిత్ తివారీ (Ankit Tiwari)
సాహిత్యం: శ్రీమణి (Shreemani)
దర్శకత్వం : ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.