Home » చిన్నమస్తా దేవి: తెగిన శిరస్సు గల మహావిద్య యొక్క భయంకర రహస్యం

చిన్నమస్తా దేవి: తెగిన శిరస్సు గల మహావిద్య యొక్క భయంకర రహస్యం

by Lakshmi Guradasi
645 views
Chinnamasta devi head cut story

చిన్నమస్త రూపం

ఆమె పేరులో ‘చిన్న’ అంటే తెగిన, ‘మస్త’ అంటే తల – అంటే తెగిన తల ఉన్న దేవత అని అర్థం. ఈ పేరు వినగానే భయం, ఆశ్చర్యం, మరియు క్యూరియాసిటీ కలుగుతాయి. హిందూ పురాణాలలో కనిపించే ప్రశాంతమైన ముఖాలు, అభయ హస్తాలు, అందమైన ఆభరణాలు ఆమె రూపంలో కనిపించవు; ఇక్కడ కనిపించేది బీభత్సం, రౌద్రం, ఊహ కందని ఒక భయంకరమైన దృశ్యం.

ఆమె తన తలను తానే నరుక్కున్నారు. ఆమె కుడి చేతిలో తన తెగిన తల, ఎడమ చేతిలో తల నరకడానికి ఉపయోగించిన ఖడ్గం ఉంటాయి. నరికిన మెడ నుంచి రక్తం మూడు దారలుగా కారుతుంది. అందులో ఒక దార ఆ తెగిన తలే తాగుతుంది, మిగిలిన రెండు దారలు ఆమెకు రెండు వైపులా ఉన్న ఆమె ఫాలోవర్స్ (డాకిని ఇంకా వర్ణిని) తాగుతారు. ఆమె నగ్నంగా (దిగంబరంగా) నిలబడి ఉంటుంది. ఈ భయానక రూపం కింద, ఆమె కాళ్ళ కింద రతి మన్మథుల జంట (కామ అండ్ రతి) శారీరకంగా కలిసి ఉన్నట్లుగా కనిపిస్తారు.

దశమహావిద్యలలో చిన్నమస్త స్థానం

చిన్నమస్తా దేవి సాక్షాత్తు ఆది పరాశక్తి స్వరూపం. ఆమె దశమహావిద్యల్లో ఆరవ మహావిద్య. సతీదేవి దక్షయజ్ఞానికి వెళ్లాలని పట్టుబడినప్పుడు, శివుడు అడ్డుపడగా, ఆమె తనలోని శక్తిని, విశ్వరూపాన్ని చూపించింది. అప్పుడు ఆమె నుంచి 10 భయంకరమైన, శక్తివంతమైన రూపాలను క్రియేట్ చేసింది, వీటినే దశమహావిద్యలు అంటారు. ఆ 10 రూపాలు: కాళీ, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమవతి, భగముఖి, మాతంగి, ఇంకా కమల.

ఈ 10 రూపాలు కేవలం ఆకారాలు మాత్రమే కాదు, అవి సృష్టి యొక్క 10 వేరు వేరు రహస్య జ్ఞానాలకు, భిన్నమైన శక్తులకు సింబల్స్. చిన్నమస్త ఈ పది మందిలో మోస్ట్ డేంజరస్, ఎక్స్ట్రీమ్లీ రా మరియు మనకు అసలు అర్థం కాని మహావిద్య. ఆమె జ్ఞానం అహంకారం యొక్క నాశనంలో ఉంది. ఆమె శక్తి కుండలిని జాగృతిలో ఉంది, ఆమె తత్వం మరణం ఇంకా పునర్జన్మ చుట్టూ ముడిపడి ఉంటుంది. ఆమెను అర్థం చేసుకోవడం బ్రహ్మవిద్యను అర్థం చేసుకోవడంతో సమానం. చిన్నమస్తా దేవిని వజ్రవైరోచని మరియు ప్రచండ చండి అని కూడా పిలుస్తారు.

రూపం వెనుక ఉన్న పురాణ కథ

పురాణాల ప్రకారం ఈ భయంకరమైన రూపం వెనుక ఒక భావోద్వేగపూరితమైన కథ ఉంది. ఒకసారి పార్వతీ దేవి తనకు ఇష్టమైన ఇద్దరు ఫాలోవర్స్ అయిన డాకిని ఇంకా వర్ణిని (కొన్ని కథల్లో జయ అండ్ విజయ) తో కలిసి మందాకిని నదికి స్నానానికి వెళ్లారు. స్నానం తరువాత, మధ్యాహ్నం వేళ డాకిని, వర్ణిని ఆకలితో ప్రాణాలు పోయేలా ఉన్నాయని ఆహారం ఇవ్వమని అమ్మవారిని వేడుకున్నారు.

ఆహారం అందుబాటులో లేకపోవడంతో, కైలాసానికి వెళ్లే వరకు ఓపిక పట్టమని పార్వతీ దేవి చెప్పింది. కానీ వారిద్దరూ ఆకలి తట్టుకోలేక కింద పడిపోయే స్టేజ్‌కి వచ్చారు. అప్పుడు జగన్మాత, తనను నమ్ముకున్న బిడ్డల ఆకలి తీర్చలేకపోతే తను తల్లినేనా అని నిర్ణయం తీసుకుంది. వెంటనే ఆమె తన కుడి చేతి గోటితో (లేదా కొన్ని పురాణాల ప్రకారం తన ఖడ్గంతో) ఒక్క వేటులో తన తలను తానే నరుక్కున్నారు. ఆ తెగిన మెడ నుంచి వచ్చిన మూడు రక్తపు దారాలలో, ఒక దారి ఆమె చేతిలో ఉన్న తెగిన తల నోట్లోకి వెళ్ళగా, మిగిలిన రెండు దారలు నేరుగా డాకిని ఇంకా వర్ణిని నోళ్లలోకి వచ్చి వారి ఆకలిని తీర్చాయి. ఈ రూపంలో ఆమె త్యాగానికి, జీవశక్తికి సింబల్‌గా వచ్చారు.

  • ప్రాణతోషే తంత్రం ప్రకారం: ఈ కథ ప్రకారం, పరిచారికలు ఆకలిగా ఉన్నప్పుడు, అమ్మవారు నల్లటి స్వరూపాన్ని తీసుకుని, తన శిరస్సును తనే ఖండించుకున్నారు. ఆ తర్వాత రక్తధారలను ఆ పరిచారికలు తాగి సంతోషించగా, అమ్మవారు తమ శిరస్సును మళ్లీ అతికించుకున్నారని ఈ తంత్రశాస్త్ర గ్రంథం చెబుతుంది. అమ్మవారు ఈ రూపాన్ని పరిచారికల కోసం కాకుండా, మన ఉపాసన (Worship) మరియు సాధన (Spiritual Discipline) కోసం తీసుకున్నారు.

రూపం వెనుక ఉన్న లోతైన తాంత్రిక యోగ రహస్యం: కుండలిని జాగరణ

భక్తి స్థాయిలో ఈ కథ త్యాగాన్ని సూచించినా, తంత్రాచార్యులు, యోగశాస్త్ర నిపుణులు దీనికి అంతర్గత (యోగిక) అర్థాన్ని కూడా ఇస్తారు. ఈ రూపం వెనుక ఉన్న అసలైన తాంత్రిక రహస్యం మన శరీరంలో జరిగే ఒక అంతర్గత యోగ ప్రక్రియ – ఆ రహస్యం పేరు కుండలిని జాగరణ. చిన్నమస్తా దేవి ఉపాసననే సహస్రార విద్య అని పిలుస్తారు.

1. మూడు రక్తపు దారలు: ఇడ, పింగళ, సుషుమ్న నాడులు

యోగ శాస్త్రం ప్రకారం, ముఖ్యంగా ఇడ, పింగళ, సుషుమ్న అనే మూడు నాడులు అత్యంత ముఖ్యమైనవి. చిన్నమస్త మెడ నుంచి చిమ్ముతున్న ఆ మూడు రక్తపు దారలు ఇంకేమీ కావు, అవి ఇడ, పింగళ, సుషుమ్న నాడుల్లో ప్రవహించే జీవశక్తి.

  • ఇడ నాడి: వెన్నుముకకు ఎడమ వైపు ఉంటుంది, చంద్ర నాడి, స్త్రీ తత్వానికి (Feminine Energy) సింబల్.
  • పింగళ నాడి: వెన్నుముకకు కుడి వైపున ఉంటుంది, సూర్య నాడి, పురుష తత్వానికి (Masculine Energy) సింబల్.
  • సుషుమ్న నాడి: ఈ రెండిటి మధ్యలో ప్రయాణించే ప్రధాన నాడి, అగ్ని తత్వానికి, జ్ఞానానికి రిప్రజెంటేషన్. సాధారణ వ్యక్తులలో సుషుమ్న నాడి మూసుకుని ఉంటుంది.

యోగ సాధన లక్ష్యం ఇడ, పింగళ నాడుల శక్తిని బ్యాలెన్స్ చేసి, మూసుకుపోయి ఉన్న సుషుమ్న నాడిని ఓపెన్ చేయడం. ఆమెకి రెండు వైపులా ఉన్న డాకిని ఇంకా వర్ణిని ఇడ మరియు పింగళ నాడులకు రిప్రజెంటేషన్ కాగా, చిన్నమస్తా దేవి స్వయంగా మధ్యలో ఉన్న ప్రధానమైన సుషుమ్నా నాడికి రిప్రజెంటేషన్. సుషుమ్న నాడి తెరుచుకున్నప్పుడు ఆ దివ్యమైన శక్తి ఇడ ఇంకా పింగళ నాడుల గుండా ప్రవహించి వాటిని పోషిస్తుంది.

2. తల నరుక్కోవడం: అహంకార వినాశనం

యోగ, తంత్ర పరిభాషలో తల మన అహంకారానికి (Ego) సంకేతం. “నేను, నాది” అనే భావనే మన తల. ఈ అహంకారమే కుండలిని శక్తి సహస్రాకార చక్రానికి చేరుకోవడానికి అడ్డంకి. కుండలిని శక్తి ఈ అహంకారం అనే తలను ఖండించినప్పుడు మాత్రమే జీవాత్మ పరమాత్మలో ఏకమవుతుంది. ఈ స్థితినే మోక్షం లేదా జ్ఞానోదయం అంటారు. కాబట్టి, చిన్నమస్త తన తల తనే నరుక్కున్నారు అనేది హింసాత్మక చర్య కాదు, అది అహంకారం ఎండ్ అవుతుంది అనే యోగిక చర్య.

3. కాళ్ళ కింద రతి మన్మథులు: కామ శక్తిపై ఆధిపత్యం

ఈ విశ్వంలో అత్యంత శక్తివంతమైన, క్రియేటివ్ పవర్ లైంగిక శక్తి (Sexual Energy). కామారతి జంట సృష్టికి, జీవానికి మూలమైన ఆ రా ఎనర్జీకి ప్రతీక, ఇది శరీరంలో అత్యంత ముఖ్యమైన మూలాధార చక్రాన్ని సూచిస్తుంది.

చిన్నమస్తా దేవి ఆ జంట మీద నిలబడింది అంటే, ఆమె ఆ లైంగిక శక్తిని, కామతత్వాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఆమె ఆ రా సెక్షువల్ ఎనర్జీని అదోముఖంగా పోనివ్వకుండా, దాన్ని ఊర్ధ్వముఖంగా మార్చి, ఆధ్యాత్మిక శక్తిగా (ఓజాస్) మారుస్తుంది. ఈ మార్చబడే శక్తే కుండలిని శక్తిగా మారి సుషుమ్న నాడి ద్వారా పైకి వస్తుంది. ఆమె కాళ్ళ కింద రతి మన్మథులు ఉండటం ఈ విద్య ఇంద్రియ నిగ్రహం (sensory control) పాటిస్తేనే సిద్ధించే విద్య అని సూచిస్తుంది.

చిన్నమస్త ఆరాధన, ప్రమాదాలు మరియు ఆలయాలు

ఆరాధన విధానం మరియు ప్రమాదాలు

చిన్నమస్తా ఆరాధన తంత్ర శాస్త్రం ప్రకారం అత్యంత ఎక్స్ట్రీమ్‌గా ఉంటది. సంసార జీవితంలో ఉన్నవారు ఆమె ఉగ్ర రూపాన్ని నేరుగా పూజించడం కొంచెం రిస్క్ అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఎక్కువగా తాంత్రికులు, అఘోరాలు ఇంకా సిద్దులే ఈ రూపాన్ని పూజిస్తారు. వారు కోరుకునేది డబ్బు, ఆరోగ్యం కాదు; వారు కోరుకునేది శక్తి ఇంకా సిద్ధి (అతీత శక్తులు), శత్రువులపై విజయం, మరియు ముఖ్యంగా కుండలిని శక్తిని ఒక్కసారిగా మేల్కొలపడం.

ఆమె ఆరాధన వామ మార్గం (Left Hand Path) అనే తాంత్రిక పద్ధతిలో జరుగుద్ది. ఈ పూజలో పంచమాకారాలను ఉపయోగిస్తారు: మధ్యం, మాంసం, మత్య (ఫిష్), ముద్ర, ఇంకా మైధున (రిచువల్ సెక్షువల్ యూనియన్). చిన్నమస్త ఆరాధన కత్తి మీద సాము లాంటిది. ఈ సాధనను తప్పుగా, భయంతో లేదా అహంకారంతో ఆరాధిస్తే, మేలుకొన్న శక్తి పవర్స్ ఇవ్వడానికి బదులుగా, పిచ్చికి లేదా బ్రమలకు (Illusions) దారి తీయవచ్చు. సరైన గురువు మార్గ నిర్దేశం లేకుండా ఈ సాధనను ఎవరూ ట్రై చేయకూడదు. చిన్నమస్తా దేవి విషయంలో సాత్వికమైన ఆరాధన కూడా చాలా చాలా కష్టం.

ప్రధాన ఆలయాలు

ఆమెకు టెంపుల్స్ చాలా అరుదుగా ఉన్నా, ఉన్నవి మోస్ట్ పవర్‌ఫుల్ మరియు తాంత్రిక శక్తులకు మెయిన్ సెంటర్స్ గా ఉంటాయి.

  • రాజరప్ప, జార్ఖండ్: ఇది ప్రధాన శక్తి స్థలం, కొందరి నమ్మకం ప్రకారం శక్తిపీఠం. ఇక్కడ ఇప్పటికీ జంతు బలులు (మేకలను బలిచే రక్తాన్ని నైవేద్యంగా) ఆచారం ఉంది.
  • కామాఖ్య, అస్సాం: తాంత్రిక విద్యలన్నిటికీ కేంద్రమైన ఈ ప్రాంతంలో దశమహావిద్యలకు 10 వేరు వేరు చిన్న టెంపుల్స్ ఉంటాయి, అందులో చిన్నమస్తాలయం ఒకటి.
  • చింతపూర్ణని, హిమాచల్ ప్రదేశ్: ఇక్కడ చిన్నమస్త యొక్క సాత్విక రూపం (సాఫ్ట్ గా, ప్లెజెంట్‌గా) ఉంటుంది. ఇది ఉగ్ర రూపం వెనుకున్న కరుణకు రిప్రజెంటేషన్.

బౌద్ధ మతంలో చిన్నమస్త రూపం

చిన్నమస్త రూపం కేవలం హిందూ తంత్రంలో మాత్రమే కాకుండా, దాదాపు ఇలాంటి రూపమే టిబెటిన్ బౌద్ధ మతం (వజ్రాయన బుద్ధిజం) లో కూడా కనిపిస్తుంది. బౌద్ధ తంత్రంలో ఆమెను వజ్రయోగిని లేదా చిన్న ముండా (The Cut Headed One) అంటారు. ఈ రూపం కూడా తన తల తనే నరుక్కుని, ఆ రక్తాన్ని ఇద్దరు ఫాలోవర్స్‌కి పంచి, కామతత్వం మీద నిలబడినట్టే ఉంటుంది.

అంతిమ సందేశం

చిన్నమస్త అంటే కేవలం విద్వంసమా, మరణమా, భయమా కాదు. ఆమె అంటే జీవన చక్రం (The Cycle of Life). ఆమె ఒకేసారి రెండు పనులు చేస్తుంది: జీవాన్ని ఇచ్చేది (తన రక్తాన్ని పంచి ఆకలి తీరుస్తుంది) మరియు జీవాన్ని తీసుకునేది (అదే రక్తాన్ని తను కూడా తాగుతుంది). ఇక్కడ తల నరుక్కోవడం మరణం కాదు, అది పునర్జన్మ.

చిన్నమస్తా దేవి ఇచ్చే సందేశం: నిజమైన స్వేచ్ఛ కావాలంటే, నీ భయాల నుంచి, బంధాల నుంచి విముక్తి కావాలంటే, నీ బయట ఉన్న శత్రువులతో పోరాడకు. నీ అసలైన శత్రువు నీ లోపలే ఉన్నాడు – అదే ‘నేను’ అనే నీ అహంకారం. నీ అహంకారం అనే తలను నువ్వే నరుక్కున్నప్పుడే నీ లోపల దాగున్న అసలైన అనంతమైన కుండలిని శక్తి మేల్కొంటుంది.

చిన్నమస్తా దేవి మహా ఉపాసకులు

  • 1. కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని: ఈయన 1936 వరకు ఉన్న మహా ఉపాసకులు, దశమహావిద్యలన్నిటికీ ఈయనను సైంటిస్ట్ అని చెప్పవచ్చు. ఆయన చిన్నమస్తా విద్యను తీవ్రంగా ఉపాసన చేస్తున్నప్పుడు, అది ఫలించే సమయానికి పక్కనే ఉన్న పొదలో శిరస్సు ఖండింపబడిన అమ్మవారి శిరస్సు కనిపించింది. ఉపాసన తీవ్రమైన తర్వాత ఆయన కపాలం చిట్లిపోయి అందులోనుంచి పొగ, రక్తం వచ్చాయి. వెన్నెముకలోంచి ప్రవహించే కుండలిని శక్తి ఆకాశంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీతో కలవడంతో ఇది జరిగింది. ఈ ఉపాసన ద్వారా ఆయనకు అపారమైన శక్తులు వచ్చాయి.
  • 2. శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి: ఈయన ప్రస్తుత తరంలో ఉన్న మహామంత్రవేత్త, కుర్తాళం పీఠాధిపతి. చిన్నమస్తా దేవి ఆయనకు ఉపాస్యదేవత మరియు అమ్మవారు ఆయనకు సాక్షాత్కరించారు.

రేణుకా దేవి మరియు చిన్నమస్తా రహస్యం

పరశురాముడు తమ తల్లి రేణుకా దేవి శిరస్సు ఖండించడం వెనుక ఉన్న రహస్యం కూడా అదే చిన్నమస్తా రహస్యం అని కావ్యకంఠ గణపతి ముని చెప్పారు. రేణుకాదేవి చిన్నమస్తా అవతారంలో కిందకు వచ్చారు. రేణుకామాత శిరస్సు మాహూర్ అనే ఎనిమిదవ శక్తిపీఠంలో (18 శక్తిపీఠాల్లో ఒకటి) కలిసిపోయింది. ఆ శక్తి పీఠంలో ఉన్న ఏకవీరాదేవి ప్రసన్న రూపంలో ఉన్నా, ఒక పెద్ద శిరస్సు ఉన్నట్టుగా కనిపిస్తారు, ఆ తల్లే చిన్నమస్తా స్వరూపం.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ చరిత్ర ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.